సినీ పరిశ్రమ నుంచి చాలామంది నటులు రాజకీయాల్లోకి రావడం కామన్ అన్న విషయం తెలిసిందే. అయితే సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చి రాణించడం అనేది ఇప్పటి నుంచి కొనసాగుతోంది కాదు ఎన్నో దశాబ్దాల  నుంచి ఎంతో మంది సినీ పరిశ్రమకు చెందిన నటులు రాజకీయాల్లోకి వచ్చి ప్రభావితం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది రాజకీయాల్లో అంతగా కలిసి రాక  మళ్లీ సినిమాలకే పరిమితమైన వారు కూడా ఉన్నారు. కేవలం హీరోలే కాదు స్టార్ హీరోయిన్లు కూడా సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. ఇలా సినిమాల్లో స్టార్ హీరోయిన్ మంచి గుర్తింపు తెచ్చుకుని... ఎన్నో విభిన్నమైన సినిమాల్లో నటించి... తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఒసేయ్ రాములమ్మగా  చెరగని ముద్ర వేసుకున్న విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. 

 

 

 మొదట టిఆర్ఎస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న సమయంలో... టిఆర్ఎస్ పార్టీలో చేరింది విజయశాంతి. ఆ తర్వాత వివిధ కారణాలతో టిఆర్ఎస్ పార్టీ నుంచి విభేదించి... ఒక కొత్త పార్టీని స్థాపించింది. కానీ ఆ కొత్త పార్టీ ద్వారా విజయశాంతికి నిరాశే ఎదురైంది అని చెప్పాలి. దీంతో ఆ కొత్త పార్టీని టిఆర్ఎస్ పార్టీలో విలీనం చేసి మరోసారి టిఆర్ఎస్ పార్టీ లోని కొనసాగింది విజయశాంతి. ఇక టిఆర్ఎస్ పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత... టిఆర్ఎస్ పార్టీలో పదవి దక్కకపోవడంతో నిరాశ చెందిన విజయశాంతి కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్ళింది. 

 

 

 

 ఇక రాజకీయాల్లోకి వచ్చి నప్పటి నుంచి సినిమాలకు పూర్తిగా దూరంగానే ఉంది విజయశాంతి. సినిమాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కాంగ్రెస్ పార్టీలో స్టార్ క్యాంపెయినర్ గా కొనసాగుతూ వచ్చింది. తనదైన ప్రసంగాలతో అధికార టీఆర్ఎస్ పార్టీ పై ఎన్నో విమర్శలు కూడా గుర్తించింది.కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు అయోమయంలో పడిపోతున్న తరుణంలో విజయశాంతి ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడిపోయింది. ఈ క్రమంలోనే విజయశాంతి బీజేపీలో చేరేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అనే వార్తలు కూడా గతంలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న సరిలేరు నీకెవ్వరు సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది విజయశాంతి. క్రమక్రమంగా రాజకీయాలను దూరం పెట్టి సినిమాల్లోనే కొనసాగుతుందని అందరూ అనుకోగా... తాను ఇక సినిమాలు చేయను అని  రాజకీయాలకే పరిమితం అవుతాను అని చెప్పకనే చెప్పింది. ఏదేమైనా రాములమ్మ రాజకీయ జీవితంలో మాత్రం ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: