రాజకీయాల్లో సినీ నటుల హవా ఎక్కువగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇతర రంగాల నుంచి రాజకీయాల్లోకి వచ్చే వారికంటే సినిమారంగంలో నుండి  రాజకీయాల్లోకి వచ్చి ఎక్కువగా ప్రభావితం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇలా తెలుగు తమిళ కన్నడ హిందీ ఇండస్ట్రీల నుంచి ఎంతోమంది సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చి ఎంతగానో ప్రభావితం చేశారు. కేవలం హీరోలు మాత్రమే కాదు ప్రముఖ నటులు హీరోయిన్లు కూడా రాజకీయాలను ప్రభావితం చేసిన వాళ్ళు చాలామంది. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకే సమయంలో స్టార్ హీరోయిన్లు గా కొనసాగి... ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ప్రభావితం చేసినవారు ఇద్దరు ఉన్నారు. 

 

 

 ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్ లు ... రోజా, విజయశాంతి. ఇద్దరు ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమను మకుటంలేని మహారాణులుగా ఏలిన  వారే. స్టార్ హీరోయిన్ గా  కొనసాగుతూ ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించి తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్  వీరిద్దరు. అంతేకాదు ఈ ఇద్దరూ ఒకే సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ లుగా కొనసాగారు. ఎవరికి వారు తమదైన నటనతో తమదైన అందం అభినయంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఆకట్టుకున్నారు. కానీ ఈ  ఇద్దరిలో ఒక స్టార్ హీరోయిన్ రాజకీయాల్లో ప్రస్తుతం మంచి పొజిషన్ లో ఉంటే.. మరొక స్టార్ హీరోయిన్ రాజకీయ భవిష్యత్తు మాత్రం ఇంకా అయోమయం లోనే ఉండిపోయింది. 

 

 

 మొదట టిడిపి పార్టీలో చేరి ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించాక.. వైసీపీ పార్టీ లోకి వెళ్లి ఓటమిలో విజయంలో అధినేత జగన్ కు తోడుగా ఉంటూ ప్రస్తుతం వైసీపీ పార్టీలో కీలక నేతగా... రెండవసారి ఎమ్మెల్యే పదవిని చేపట్టి... క్యాబినెట్ హోదా ఉండే ఏపీఐఐసీ చైర్మన్ పదవి లో కొనసాగుతుంది రోజా. ఇక మరో స్టార్ హీరోయిన్ అయినా విజయశాంతి.. మొదట టిఆర్ఎస్ పార్టీలో కొనసాగి.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లి... కాంగ్రెస్ పార్టీలో స్టార్ క్యాంపెయినర్ గా కొనసాగుతూ... ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయోమయం లో పడిన సమయంలో.. పార్టీలో కొనసాగాలా లేక వేరే పార్టీలో కి వెళ్లాలా అనే అయోమయం లోనే ఉంది విజయశాంతి.

మరింత సమాచారం తెలుసుకోండి: