తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు నందమూరి బాలకృష్ణ. నందమూరి తారక రామారావు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నందమూరి బాలకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను ఎంతగానే గుర్తింపు సంపాదించారు. ఇదిలా ఉండగా...  అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వియ్యంకుడి గా... టిడిపి పార్టీలో కీలక నేతగా కూడా కొనసాగుతున్నారు నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ. అయితే 2019 ఎన్నికల్లో హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచారు. 

 

 

 

 అయితే 2019 ఎన్నికల తర్వాత ఎంతో ఘనచరిత్ర కలిగిన టిడిపి పార్టీ పరిస్థితి అయోమయం లో పడిన విషయం తెలిసిందే. చంద్రబాబుకు వెన్నుముక గా  ఉన్న కీలక నేతలు అందరూ పార్టీ నుంచి వీడి  పోతుండడం.. మరోవైపు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ షాక్ లు ఇస్తుండడం తో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి పార్టీ పరిస్థితి గడ్డు కాలం లోనే నడుస్తోంది అని చెప్పవచ్చు. దానికి తోడు ప్రస్తుతం ఆంధ్ర రాజకీయ పరిణామాలలో హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నా టిడిపి పార్టీ కీలక నేత బాలకృష్ణ ఎక్కడ జోక్యం చేసుకోవడం లేదు. ముఖ్యంగా సినిమాల పైనే ఎక్కువ దృష్టి పెట్టారు నందమూరి బాలకృష్ణ. 

 

 

 అయితే ప్రస్తుతం టిడిపి పార్టీ పరిస్థితి రోజు రోజుకు ప్రశ్నార్ధకంగా మారుతున్న సమయంలో నందమూరి బాలకృష్ణ రాజకీయ భవిష్యత్తు ఏమిటి అన్నది కూడా ప్రస్తుతం ఓ క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది. ఎందుకంటే ప్రస్తుతం వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతగానో ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో... రోజురోజుకు టిడిపి పార్టీ ప్రశ్నార్ధకంగా మారుతున్న  క్రమంలో వచ్చే  అసెంబ్లీ ఎన్నికల నాటికి బాలకృష్ణ అసలు టిడిపి పార్టీ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు అన్నది కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగానే మారిపోయింది. చూడాలి మరి బాలకృష్ణ రాజకీయ భవిష్యత్తు ఎటు మలుపు తిరుగుతుందో అని .

మరింత సమాచారం తెలుసుకోండి: