సూపర్ స్టార్ కృష్ణ.. అత్యధిక సినిమాల‌లో హీరోగా నటించిన రికార్డు ఈయన సొంతం.. దాదాపు 344 సినిమాల్లో హీరో కృష్ణ నటించాడు. వరుసగా తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేయడం కృష్ణకు అలవాటు. అలా ఆయన ఇండస్ట్రీ కళకళలాడటంతో తన వంతు పాత్ర పోషించారు. ఎన్టీఆర్, ఏన్నార్ వంటి నటుడు సినీరంగాన్ని ఏలుతున్న సమయంలోనూ కృష్ణ తన ప్రత్యేకత చాటుకున్నారు.

 

 

అయితే ఒకానోక సమయంలో హీరో కృష్ణ రాజకీయాల వైపు మొగ్గారు. మొదటి నుంచి ఎన్టీఆర్ అంటే కాస్త ఎడమొగంగా ఉండే కృష్ణ సహజంగానే కాంగ్రెస్ వైపు ఆకర్షితులయ్యారు. ఆయన 1989లో ఏలూరు నియోజక వర్గం నుంచి పోటీ చేసి బోళ్ల బుల్లిరామయ్యపై విజయం సాధించిన పార్లమెంటులో అడుగు పెట్టారు. అప్పట్లో కృష్ణ చేసిన ఓ రాజకీయ ప్రకటన కలకలం రేపింది. బోళ్ల బుల్లి రామయ్యను ఓడించిన ఆనందంలో.. బుల్లి రామయ్యనే కాదు.. పెద్ద రామయ్యనూ ఓడిస్తానంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు.

 

 

అయితే ఆ తర్వాత కృష్ణ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనలేదు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణ గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం కోరుకున్నా... కాంగ్రెస్ పార్టీ మాత్రం తిరిగి ఏలూరులోనే పార్టీ పోటీచేయించింది. ఆ ఎన్నికల్లో 31 వేల ఓట్ల పైచిలుకు తేడాతో ప్రత్యర్థి బోళ్ళ బుల్లిరామయ్యపై కృష్ణ ఓటమి పాలయ్యాడు. అయితే కృష్ణ ఆ ఓటమితో కాస్త నిరుత్సాహపడ్డారు. ఆ తరవాత తనకు సన్నిహితుడు, రాజకీయాల్లో తనను ప్రోత్సహించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ 1991లో దారుణ హత్యకు గురికావడంతో కృష్ణ రాజకీయాలపై అంతగా ఆసక్తి కనపరచలేదు.

 

 

అయితే కృష్ణ కోరిన గుంటూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇవ్వకపోవడం కూడా ఇందుకు ఓ కారణంగా చెబుతారు. ఆ తర్వాత కారణాలతో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీచేయడం మానుకున్నారు. 2009 ఎన్నికల్లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి కోరక మేరకు కాంగ్రెస్ పార్టీకి కృష్ణ కుటుంబం నైతిక మద్దతు అందించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: