వల్లభనేని వంశీ టీడీపీలో ఎమ్మెల్యేగా కొనసాగించారు. తరువాతి కాలంలో వంశీపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నకిలీ పట్టాల కేసు నమోదు చేయించారని ఆరోపించారు. అనంతరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అక్కడే సభలో తాను మాట్లాడుతూ.. ఇలా అయితే నేను టీడీపీ లో కొనసాగలేనని ఆయన అన్నారు. నేను సభలో మాట్లాడుతుంటే.. టీడీపీ సభ్యులు అడ్డుపడుతున్నారని స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. 

 

 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ   ఎమ్మెల్యేగా కొనసాగేందుకు అనర్హుడని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వంశీ స్పందించారు. తనకు మాట్లాడే హక్కు ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. 

 

 

సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిసినంత మాత్రాన తనను సస్పెండ్‌ చేస్తారా? అంటూ మండిపడ్డారు. తాను టీడీపీ సభ్యుడు అని అంటూ తనకు మాట్లాడే హక్కు ఎందుకు ఇవ్వట్లేదని బాబును ప్రశ్నించారు. ఇలా అయితే నేను టీడీపీతో ఉండలేను అంటూ టీడీపీ పై విరుచుకుపడ్డారు. వంశీ సీఎం ను ఎందుకు కలవాల్సి వచ్చిందో ఆ విషయమై మాట్లాడారు. వంశీ మాట్లాడుతూ.. ఇళ్ల పట్టాల గురించి సీఎం జగన్‌ ను కలిశానని, తన నియోజకవర్గ సమస్యలు సీఎంకు చెప్పుకున్నానన్నారు. 

 

 

అయితే ఆ తరువాత తన పై చంద్రబాబు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయించారని వంశీ అన్నారు. రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టే నిర్ణయాన్ని నేను స్వాగతించానని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా గతంలో తాను చాలా సార్లు సీఎం జగన్ ను కలిశానని చెప్పారు. పోలవరం కుడి కాలువ విషయంలో సీఎంతో చర్చించానని అన్నారు. అంతమాత్రాన తనను పార్టీనుంచి సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. కాగా., సీఎం జగన్ ను కలిసేందుకు జిల్లాకు చెందిన మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని సహకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: