మూడు సార్లు ఉత్తమ నటుడిగా అందుకున్న గొప్ప తార ఇతను. కేవలం ఎక్కువ తమిళ్ సినిమాలనే నటించినప్పటికీ భారతదేశం అంతటా ఇతను పేరు తెలుసు. ఈ నటుడు బహుముఖ ప్రజ్ఞాశాలి. వట్టి నటుడిగా మాత్రమే కాక దర్శకుడిగా, నిర్మాతగా, గాయకుడుగా, నృత్య దర్శకుడిగా, కధా రచయితగా, మాటల రచయితగా కమల్ హాసన్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇతను మంచి రాజకీయ నాయకుడు కూడా. 

 

IHG

 

ఇటు తెలుగులో కూడా అనేక సినిమాలలో నటించాడు ఈ హీరో. ఇది కథ కాదు, దశావతారం, ఇంద్రుడు చంద్రుడు, సొమ్మొకడిది సోకొకడిది, ఒక రాధా ఇద్దరు కృష్ణులు, అంతులేని కథ, మరో చరిత్ర, శుభ సంకల్పం, సతి లీలావతి, స్వాతి ముత్యం, మైఖేల్ మదన్ కామరాజు, విశ్వరూపం ఇలా అనేక తెలుగు సినిమాలలో నటించాడు కమల్ హాసన్. 

 

తమిళ్ లో అనేక సినిమాలకి నిర్మాతగా వహించాడు హీరో కమల్ హాసన్. కమల్ హాసన్ కి సమాజ సేవ ఎక్కువే. తన అభిమానులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. హీరో కమల్ హాసన్ కొత్త పార్టీని పెట్టడం జరిగింది. ఆ పార్టీ పేరు మక్కల్ నీధి మయ్యంగా. మధురై బహిరంగ సభలో చెప్పాడు. అభిమానులు చప్పట్లతో సంతోషాన్ని వ్యక్త పరిచారు. 

IHG

 

మక్కల్ నీధి మయ్యం అంటే ప్రజా న్యాయ కేంద్రం అని అర్ధం. పీపుల్స్ జస్టిస్ సెంటర్ అని ఆంగ్లంలో దీనికి అర్ధం. నేను నాయకుడిని కాదు మీలో ఒక్కడిని అంటూ ఎన్నో మాటలు చెప్పాడు కమల్ హాసన్. అప్పటి నుండి కూడా ఎన్నో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలా నటుడు కమల్ హాసన్ పార్టీ పెట్టి సేవ చెయ్యాలి ప్రజలకి అని లక్ష్యంతో కృషి చేస్తున్నాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: