ప్రతిష్టాత్మక గూగుల్ సంస్థ ఈ ఏడాది ఇప్పటి వరకు ఆన్‌ లైన్‌ లో అతి ఎక్కువ మంది సెర్చ్‌ చేసిన వ్యక్తుల లిస్ట్‌ ను ప్రకటించింది. ఈ లిస్ట్‌ లో సంగీత రంగంలో ఉన్న మహిళల లిస్ట్‌ లో టైలర్‌ స్విఫ్ట్‌ టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. మార్చి 8, ఆదివారం మహిళా దినోత్సవం సందర్భంగా ఈ లిస్ట్‌ను ప్రకంటించింది గూగుల్‌.

 

గూగుల్‌ అందించిన సమాచారం ప్రకారం అతి ఎక్కువ మంది సెర్చ్‌ చేసిన మహిళ లిస్ట్‌లో సంగీత రంగం నుంచి టైలర్‌ స్విఫ్ట్ తొలి స్థానంలో నిలవగా క్రీడా రంగం నుంచి సెరెనా విలియమ్స్‌ టాప్‌ ప్లేస్‌ లో నిలిచింది. హాస్య నటీమణులలో అక్వా ఫినా టాప్‌ ప్లేస్‌లో నిలవగా రచయితగా టోనీ మోరిసన్‌ నెంబర్‌ వన్‌ ప్లేస్‌ దక్కించుకుంది.

 

ఓవరాల్‌గా చూసుకుంటే అమెరికాలో సంగీత పరంగా మహిళ గురించి చేసిన సెర్చ్‌ ఆల్‌ టైం హైకి చేరగా మహళా అభ్యున్నతికి సంబంధించిన సమస్య గురించి చేసే సెర్చ్‌ 330 శాతం పెరిగినట్టుగ గూగుల్‌ వెల్లడించింది. అయితే  ఈ సర్వే కేవలం పాశ్చాత్య దేశాలకు సంబంధించి మాత్రమే నిర్వహించటంతో భారతీయులకు ఈ లిస్ట్‌లో స్థానం దక్కలేదు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Claws out, kitties. 🐈

A post shared by Taylor Swift (@taylorswift) on

మరింత సమాచారం తెలుసుకోండి: