ఈ మద్య టాలీవుడ్ లో లిప్ లాక్ సీన్లు సర్వ సాధారణం అయ్యాయి. ఒకప్పుడు హాలీవుడ్ లో మాత్రమే ఈ కల్చర్ ఉండేది.. రాను రాను బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లోకూడా మొదలైంది. చిన్న హీరో నుంచి స్టార్ హీరొల వరకు తమ సినిమాల్లో లిప్ లాక్ సీన్లు తప్పకుండా మెయింటేన్ చేస్తున్నారు.  కొత్తగా వస్తున్న నటీనటులు అయితే ఈ డోస్ కాస్త ఎక్కువగానే పెంచుతున్నారు. అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 లాంటి సినిమాల్లో నిమిషాల పాటు లిప్ లాక్ సీన్లు ఉన్నాయి.  ఇక బాలీవుడ్ లో అయితే ఇది మరీ ఘోరంగా తయారైంది.. చూసే వారికే వెగటం వచ్చేలా సీన్లు చిత్రీకరిస్తున్నారు.  ఒకప్పుడు లిప్ లాక్ సీన్లు అంటే చాలా ఆలోచించి మరీ ఒప్పుకునేవారు.. హీరో, హీరోయిన్లు లిప్ లాక్ సీన్ అంటే ఎంతో ఇబ్బందులు పడ్డ సంఘటనలు కూడా ఉన్నాయట.

 

తాజాగా కరిష్మా కపూర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో  ఒక రొమాంటిక్ సీన్ ని గుర్తు చేసుకున్నారు.  1996లో వచ్చిన ‘రాజా హిందూస్థానీ’ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.  ఈ సినిమాలో అమీర్ ఖాన్ మొదట అమాయకంగా ఉంటూ.. ఊరిని సందర్శించడానికి వచ్చిన కరీష్మా కపూర్ ని ప్రేమిస్తాడు. వారి మద్య తర్వాత అభిప్రాయభేదాలు రావడంతో విడిపోతారు..తర్వాత ఎలా కలుసుకుంటారు అన్నదే కథ.  

 

అయితే ఈ మూవీలో రెయిన్ సీన్ లో వచ్చే రొమాంటిక్ కిస్ సీన్ గురించి కరిష్మా బయటపెట్టింది. అందరు ఆ కిస్ సీన్ ఒక గంటలో తీసేశారని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఆ సీన్ కోసం మూడు రోజులు కష్టపడాల్సి వచ్చింది. ఊటీలో చల్లని ప్రదేశంలో ఆ సీన్ కోసం రొమాంటిక్ మూడ్ కోసం నానా తంటాలు పడాల్సి వచ్చిందని అన్నారు.  అప్పట్లో ఈ సిన్ కూడా పెద్ద సెన్సేషన్ అయిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: