మన టాలీవుడ్ లో బాగా  పాపులర్ అయిన హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో అనుష్క నటించిందంటే ఆ సినిమా హిట్టే.. అందరి హీరోల పక్కన హీరోయిన్ గా నటించింది.తర్వాత ప్రభాస్ తో కలిసి నటించిన  'బాహుబలి' భారీ విజయం తో అనుష్కకు దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు దక్కింది. టాలీవుడ్ లో లేడీ ఒరియంటెడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగల నటి అనుష్క. అయితే 'బాహుబలి సినిమా  తర్వాత అనుష్క చేసే సినిమాల సంఖ్య చాలా తగ్గిపోయింది.లేడీ ఓరియెంటెడ్ సినిమాల కోసం ఒక ప్రయోగాత్మక సినిమాలో నటించింది.. ఆ సినిమా వల్ల లేని పోనీ చిక్కులు తెచ్చుకుంది. 

 

 


"సైజ్ జీరో' కోసం వెయిట్ పెరగడం స్వీటీ గ్లామరస్ కు ఎసరుపెట్టింది. అప్పటి నుంచి మునుపటి లాగా స్లిమ్ముగా మారాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా స్వీటీ మాత్రo బరువు తగ్గడంలేదు.  దీంతో స్వీటీతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు గ్రాఫిక్స్ ను గట్టిగా నమ్ముకుంటున్నారని  వదంతులు వినిపిస్తున్నాయి. బాహుబలి సినిమా కోసం కూడా అనుష్క ని నాజూగ్గా చూపించడానికి చాలా కష్ట పడ్డారట. స్వీటీ అసలు రెమ్యూనరేషన్ కు తోడు ఇది కొసరు రెమ్యూనరేషన్ గా మారిందనే టాక్ కూడా ఉంది. ఇదిలా ఉంటే స్వీటీ ఫ్యాన్స్ మునుపటి హాట్ ఫోటోలను చూసుకుంటూ మురిసిపోతూనే ఉన్నారు.బిల్లా లో అనుష్క ని మళ్ళా చూడాలని అనుకుంటున్నారట. 

 

 

అనుష్క మళ్ళీ అలా మారాలని సోషల్ మీడియాలో కూడా అక్కడక్కడా డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.అనుష్క నడుముకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.. బిల్లా సినిమాలో వేసుకున్న బికినీ డ్రెస్ లో అనుష్క ని చూస్తే కుర్రకారు కి కాకా రేపాలిసిందే. ఇక ఆ నడుము దగ్గర ఉన్న కట్ అయితే బ్లాక్ బస్టర్ అనుకోవాలి. లూస్  హెయిర్ స్టైల్.. బ్లాక్ కూలింగ్ గ్లాసెస్.. పింక్ లిప్ స్టిక్ అన్నీ సరిగ్గా మ్యాచ్ అయ్యాయి.జీరో సైజ్ లో సెగలు పుట్టించే అనుష్క ఇప్పుడు లావుగా బొద్దుగా మారిపోయింది  ఇలాంటి ఫోటోలు చూసిన ఫ్యాన్స్ అలాంటి గ్లామరే కావాలని ప్రత్యేక గ్లామర్ కోసం డిమాండ్లు వినిపించడంలో తప్పులేదు. సోషల్ మీడియా లో పాత అనుష్క కావాలని డిమాండ్ కూడా చేస్తున్నారు.మరి స్వీటీ అభిమానులు కోరిక మేరకు మళ్ళీ పాత అనుష్క లా మారుతుందా లేదా అన్నది చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: