టాలీవుడ్ యాంగ్రీ మెన్ అంటే తెలియని వారుండరు... యావత్ ప్రపంచంలోనే అతని అభిమానులుంటారు. అలాగే కాలానుగుణంగా అతను తన అభిమానులకు మరింత దగ్గర కావడం కోసం ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా వుంటారనే విషయం అందరికి విదితమే. ట్విట్టర్ లో ఎపుడు ఆయన ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటాడు. తాజాగా అమితాబచ్చన్ గారు ఒక ఫొటోను షేర్ చేసి, అందరికి వావ్ అనిపించేలా చేసాడు.

 

ఇంతకీ అదేమిటంటే, అందరికి అమితాబ్ నచ్చితే... ఆయనకి నచ్చింది వేరొకటుంది. అతనికి మామ్మూలుగా విదేశీ కార్లంటే విపరీతమైన మోజు. ఆ కోవలోనే రీసెంట్ గా ఒక పసుపు పచ్చ వింటేజ్ కార్ ముందు హుందాగా నవ్వుతూ.. దిగిన ఫోటోను అతను తన పర్సనల్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసారు. అలాగే, ఆ కారంటే తనకు ఎంతో అభిమానం అన్నట్లుగా కూడా అందులో పేర్కొనడం గమనార్హం. 

 

 

అయన సదరు కారు అనుభవాన్ని ప్రస్తావిస్తూ.. "మనం, ఆనందంగా ఉన్న టైం లో మనకు చెప్పడానికి  మాటలు రావు. సరిగ్గా ఇప్పుడు నాది కూడా అదే పరిస్థితి. నేను ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాను. కాని మాటలు రావడం లేదు. ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. నాకు మాట బయటకు రాకున్నా కూడా ఒక మంచి అనుభవం నాకు దక్కిందని, ఆవిషయం మీకు ఈ ఫోటో ద్వారా దృశ్య రూపంలో మాత్రమే చెప్పగలనని.. ఈ క్షణం నేను ఏంటో ఆనందంగా వున్నానని...." బిగ్ బి చెప్పుకొచ్చాడు.

 

ప్రస్తుతం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ బ్రహ్మాస్త్ర చిత్రంలో నటిస్తున్న విషయం మనకు విదితమే. సినిమాలతో పాటుగా అయన వివిధ రకాలైన బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి కూడా తెలిసినదే. అయితే షూటింగ్స్ తో ఎంత బిజీగా వున్నప్పటికి, తనకున్న కార్ల అభిమానాన్ని అయన ఎప్పుడు ఈ విధంగా చాటుకుంటూ వుంటారు. ఆ అభిమానంతోనే ఈ ఎల్లో కలర్ వింటేజ్ కారును తన ఇంటికి తీసుకు వచ్చినట్లుగా బాలీవుడ్ విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక దేశంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన ఈ వింటేజ్ కారును అమితాబ్ దక్కించుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: