మాధ‌వీల‌త.. మొదట్లో చిన్న చిన్న పాత్రతో సినిమాల్లోకి అడుగుపెట్టి ఈమె.. 2008లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన నచ్చావులే సినిమాలో హీరోయిన్‌గానటించింది. ఈ సినిమా హిట్ అవ్వ‌డంతో మాధ‌వీ ల‌త మంచి గుర్తింపు వ‌చ్చింది. ఇక ఈ చిత్రం తర్వాత మాధ‌వీల‌త‌ న్యాచుర‌ల్ స్టార్ నాని సరసన హీరోయిన్‌గా న‌టించిన‌ స్నేహితుడా సినిమా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఆ త‌ర్వాత కొంతమంది హీరోల పక్కన ఆడిపాడిన ఈమె అచ్చ తెలుగు అమ్మాయి అవడంతో.. హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతుంద‌ని అందరూ అనుకున్నారు .


అయితే అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడంలో చేతులెత్తేసిన మాధవీలత సినిమాలకు గుడ్ బై చెప్పేసి అమెరికా వెళ్లి కొద్దిరోజులపాటు అక్కడే సెటిల్ అయింది. ఈ క్ర‌మంలోనే అక్క‌డ కోవెంట్రీ విశ్వవిద్యాలయం నుండి ఫాషన్ డిసైనింగ్ లో మాస్టర్స్ డిగ్రీని పొందింది. ఆ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన మాధవీలత సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండటంతో పాటు కొన్ని ఇంటర్వ్యూలలో హాట్ హాట్ కామెంట్లతో వార్తల్లోకి ఎక్కింది. ఇక‌ గత ఎన్నికలకు ముందు బిజెపిలోకి చేసిన ఆమె గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశారు.


ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఓ రాజకీయ నేతగా తానేంటో నిరూపించుకుంటానని ఆమె ప్ర‌చారం కూడా చేసింది. ప్రజలకు అందుబాటులో ఉంటాననీ, మహిళలకు అండగా ఉంటాననీ మాధవీలత హామీలు కూడా ఇచ్చారు. కానీ, అక్క‌డ ఆమెకు డిపాజిట్లు కూడా ద‌క్క‌లేదు. ఇక గుంటూరు నుంచి టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలలో కనిపించడమే తప్పా రాజకీయాలలో పత్తా లేకుండా పోయారు. అయితే ఇటీవ‌ల తనకు ఎన్నికల్లో ఓడిపోయినందుకు బాధ లేదన్న ఆమె... మనుషులు మానవత్వం, మంచితనం మర్చిపోయి మాట్లాడే మాటలకి మాత్రం బాధగా ఉందని చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈమె రాజ‌కీయాల్లో అడ్రెస్ లేక‌పోయినా.. సోష‌ల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్‌గా ఉంటూ వ‌స్తోంది.
 

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: