యువ హీరోలలో శర్వానంద్ కి ఒక మంచి గుర్తింపు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అంతేకాదు శర్వానంద్ సినిమా వస్తుందంటే అటు ప్రేక్షకుల్లో కూడా మంచి ఒపీనియన్ ఉంటుంది. శర్వానంద్ కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తారని... అందుకే శర్వానంద్  సినిమా అంటే అందులో ఏదో స్పెషల్ వుంటుంది అని అనుకుంటారు అభిమానులు. అయితే చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకుంటూ ఆ తరువాత ఏకంగా హీరోగా మారిపోయాడు శర్వానంద్. ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. అయితే మహానుభావుడు తర్వాత శర్వానంద్ కు సరైన హిట్ లేదు. ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిట్ సాధించలేకపోయాడు. ఇక ఆ తర్వాత రణరంగం సినిమా లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెర మీదికి వచ్చిన విజయం వరించలేదు... ఇక మొన్నటికి మొన్న తమిళ హిట్ మూవీ 96 తెలుగు రీమేక్ జాను లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తో కలిసి నటించిన శర్వానంద్ కు కలిసి రాలేదు. 

 


 దీంతో వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు హీరో శర్వానంద్. అయితే మామూలుగానే శర్వానంద్ కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు శర్వానంద్ కెరీర్ లో  హడావిడిగా చేసిన సినిమా సందర్భాలు ఎక్కడా కనిపించవు. నిదానంగా ఒక్కో సినిమా చేసుకుంటూ వెళ్తున్నాడు శర్వానంద్. అయినప్పటికీ శర్వానంద్ కు ఈ మధ్య హిట్స్ మాత్రం దక్కడం లేదు. అయితే షెడ్యూల్ షెడ్యూల్  కి కూడా కాస్త గ్యాప్ తీసుకుంటూ ఉంటాడు శర్వానంద్. ఎలాంటి తొందరపడకుండా టెన్షన్ లేకుండా తాపీగా హాయిగా షూటింగ్స్ పెట్టుకుంటూ ఉంటాడు. అయితే శర్వానంద్  ఎంచుకునే కథలు బాగా ఫ్యామిలీ ఆడియన్స్ ను  యువతను ఆకర్షిస్తూ ఉంటాయి.. అందుకే శర్వానంద్ కి ఎక్కువ యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ ఉంటుంది. 

 


 ఈ కారణంతోనే అటు నిర్మాతలు కూడా శర్వానంద్ తో సినిమాలు తీయడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే ఇటీవలే శర్వానంద్ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నేపథ్యంలో... శర్వానంద్ తన పారితోషికం విషయంలో మాత్రం ఎక్కడా తగ్గడం లేదట. శర్వానంద్ ఒక సినిమాకి ఏకంగా ఏడు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటాడని టాక్ వినిపిస్తోంది. అయితే ఏ  హీరోకైనా విజయాలు లేవు అంటే  కాస్త డిమాండ్ తగ్గిపోతుంది అని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శర్వానంద్ తో సినిమా తీయాలని నిర్మాతలు ముందుకు వచ్చినప్పటికీ... శర్వానంద్ పారితోషికం తగ్గించుకోకపోవడంతో నిర్మాతలు వెనకడుగు వేస్తున్నట్టు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం శర్వానంద్ చేతిలో వ్యవసాయ నేపథ్యంలో సాగే శ్రీకారం సినిమాతో  పాటు మరో మూడు సినిమాలు కూడా ఉన్నాయి ప్రస్తుతం శర్వా నంద్ దృష్టి మొత్తం ఈ సినిమాల  పైన ఉన్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: