తెలుగు సినిమా పరిశ్రమకు చిలక గోరింక సినిమాతో నటుడిగా పరిచయం అయిన రెబల్ స్టార్ కృష్ణంరాజు, మొదటగా సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించారు. అయితే ఆ తరువాత నటుడిగా తన టాలెంట్ తో మంచి పేరు దక్కించుకున్న కృష్ణంరాజు, ఆపై హీరోగా మారి పలు సినిమాల్లో నటించడం జరిగింది. అప్పట్లో కృష్ణ, శోభన్ బాబుల తరువాత మంచి పేరున్న స్టార్ హీరోగా పేరు దక్కించుకున్న కృష్ణంరాజు, ఆ తరువాత కొన్నేళ్ళకు రాజకీయాల్లోకి ప్రవేశించారు. ముందుగా కాంగ్రెస్ తరపున రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కృష్ణంరాజు, ఆపై భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ తరువాత అదే పార్టీ తరపున కాకినాడ నియోజకవర్గ ఎంపీగా అత్యధిక మెజారిటీతో విజయం అందుకున్న కృష్ణంరాజు. 

 

అక్కడి నుండి నుండి చాలా ఏళ్ళ పాటు బిజెపిలోనే కొనసాగడం జరిగింది. ఇక ఇప్పటికీ కూడా అదే పార్టీ తరపున పని చేస్తున్న కృష్ణంరాజు, 2009 సమయంలో మెగాస్టార్ చిరంజీవి నెలకొల్పిన ప్రజారాజ్యం పార్టీలో చేరి, అనంతరం జరిగిన ఎన్నికలలో ఆ పార్టీ తరపున రాజమండ్రి ఎంపీ స్థానానికి పోటీ చేసి ఘోరంగా ఓడిపోవడం జరిగింది. అయితే అప్పట్లో ఆయన ఎన్నో ఆశలతో ప్రజారాజ్యంతో చేరడం, అది సక్సెస్ కాకుండా ఆయన ఆశలు అడియాశలు కావడంతో ఆయనపై కొద్దిపాటి విమర్శలు కూడా వచ్చాయి. 

 

కాగా ఆ తరువాత ఒక మీడియా సమావేశంలో కృష్ణంరాజు మాట్లాడుతూ, నిజానికి మొదటి నుండి తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది బిజెపి పార్టీ అని, అయితే మధ్యలో తాను ప్రజారాజ్యం పార్టీ లో చేరడం తాను కొంత తొందరపడి తీసుకున్న నిర్ణయం అని కృష్ణంరాజు చెప్పడం జరిగింది. వాస్తవానికి చిరంజీవితో తనకు మంచి అనుబంధం ఉందని, ఆయనతో తనకు ఎటువంటి విబేధాలు లేనప్పటికీ ఆ పార్టీలో చేరకుండా ఉండాల్సిందని కృష్ణంరాజు తెలిపారు. ఇక ఆ తరువాత మళ్ళి బీజేపీ తీర్ధం పుచ్చుకున్న కృష్ణంరాజు, ఇప్పటికే ఎప్పటికీ అదే పార్టీలో కొనసాగుతానని అంటున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: