ఈమధ్య టాలీవుడ్ లో సినిమాల విడుదల కోసం సరైన టైమ్ వెతుక్కునే పరిస్థితులు ఎక్కువైపోయాయి. సాధారణంగా సినిమా ప్రారంభం సమయంలోనే విడుదల ఎప్పుడు చేయాలా అని దర్శక, నిర్మాతలు ఓ అంచనాకు వస్తారు. అయితే పరిస్థితుల ప్రభావంతో కొన్ని సినిమాలు ఆలస్యమవుతాయి.. మరికొన్ని టైమ్ కు రిలీజ్ అయిపోతాయి. ప్రస్తుతం ఓ భారీ సినిమా అనుకున్న డేట్ కు రిలీజ్ కాకపోవడంతో ఇద్దరు కుర్ర హీరోల సినిమాలు ఆ డేట్లో రిలీజ్ కు పోటీ పడుతున్నాయి. విశేషమేమంటే ఆ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కావడం.

 

 

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ ఈ ఏడాది జూలై 30న విడుదల కావాల్సింది. పలు కారణాల రీత్యా ఆ సినిమా వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానుంది. దీంతో మొదట ఆర్ఆర్ఆర్ కు ప్రకటించిన తేదీన పలు సినిమాలు రిలీజ్ అవుతున్నాయని వార్తలు వచ్చాయి. అయితే.. ఆ తేదీన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న బాక్సర్, నితిన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న రంగ్ దే పోటీ పడబోతున్నాయని తెలుస్తొంది. ప్రస్తుతం ఈ వార్త ఫిలింనగర్ సర్కిల్స్ లో రౌండ్ అవుతోంవి.

 

 

రీల్ లైఫ్ లో వీరిద్దరి సినిమాలు పోటీ పడుతున్నా.. రియల్ లైఫ్ లో మాత్రం వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరూ కెరీర్లో బెస్ట్ ఫేస్ లో ఉన్నారు. వరుణ్ తేజ్ వరుస హిట్లతో దూసుకెళ్తుంటే నితిన్ రీసెంట్ గా భీష్మతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇద్దరూ ఫ్రెండ్సే అయినా ఇద్దరూ ఎక్కడా తగ్గడం లేదట. దీంతో ఆరోజు ఫైట్ ఖాయమంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. దీనిపై అఫిషియల్ న్యూస్ రావాల్సి ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: