ఒక యూట్యూబ్‌లో డైరెక్ష‌న్ నేర్చుకుని ఒక సినిమాని డైరెక్ట్ చేసింది డైరెక్ట‌ర్ శ్రీ‌విద్య‌. 26 ఇంట‌ర్నేష‌న‌ల్‌ ఫిలిం ఫెస్టివ‌ల్ అవార్డ్స్ సొంతం చేసుకున్న సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌ ‘మ‌ధ‌’. థర్డ్ ఐ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాహుల్, త్రిష్ణా ముఖర్జీ హీరో హీరోయిన్లుగా శ్రీవిద్య ద‌ర్శ‌క‌త్వంలో ఇందిరా బ‌స‌వ నిర్మించిన ఈ చిత్రం మార్చి 13న విడుద‌ల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో...

 

హరీశ్ శంక‌ర్ మాట్లాడుతూ - ‘‘ మొద‌ట్లో సినిమాల్లోకి వెళ‌తాను అని మా నాన్న‌గారికి చెపితే ఆయ‌న బెల్టు తీశారు న‌న్ను కొట్ట‌డానికి. వెంట‌నే వాళ్ళ అమ్మ‌గారు స‌పోర్ట్ చేశారు అని అన్నారు. అలా కొట్టేది అని ఆవిడ చీపురు తిర‌గేశార‌ట. అలా ఈ సంద‌ర్భంగా ఆయ‌న స‌ర‌ద‌గా చెపుతూ శ్రీ‌విద్య లాంటి త‌ల్లి చాలా త‌క్కువ మందికి ఉంటారు అని చెపుతున్నారు. ఎప్పుడు పాట‌లు, ఫైట్స్ ఉన్న సినిమాల‌తో పాటు ఇలాంటి సినిమాలు కూడా వ‌స్తుండాలి. శ్రీవిద్య నిజంగా అదృష్ట‌వంతురాలు. పిల్ల‌లు క‌ల‌ల్ని నేరవేర్చే త‌ల్లిదండ్రులు చాలా మంది ఉంటారు. అలాంటి మాతృమూర్తి ఇందిర బ‌స‌వ‌గారికి చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తున్నాను. మ‌నం అనుకున్న ప‌నిని చేయ‌డ‌మే స‌క్సెస్‌. ఆ ప‌ని ప‌ది మందికి న‌చ్చితే అది బోన‌స్‌. ఆ కోవ‌లో శ్రీవిద్య ఆల్‌రెడీ స‌క్సెస్ అయ్యింది. ఈ సినిమాకు అద్భుత‌మైన టెక్నిక‌ల్ టీం ప‌ని చేసింది. రెగ్యుల‌ర్‌గా వ‌చ్చే సినిమా కాదు. ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్‌లో వ‌స్తున్న సినిమా. ఈ సినిమాలో భాగ‌మైన ప్ర‌తి ఒక్క‌రికీ అభినంద‌న‌లు. మార్చి 13న సినిమా విడుద‌ల‌వుతుంది’’ అన్నారు. 

 

డైరెక్టర్ శ్రీవిద్య బసవ మాట్లాడుతూ - ‘‘మా సినిమాను రిలీజ్ చేయడంలో సపోర్ట్ చేస్తున్న హరీశ్‌గారికి, న‌వ‌దీప్‌గారికి, మ‌హేశ్‌గారికి థాంక్స్. మా అమ్మగారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సినిమాను పూర్తి చేయ‌డానికి నాకు అండ‌గా నిల‌బ‌డ్డారు. మా మ్యూజిక్ డైరెక్ట‌ర్ న‌రేశ్ కుమర‌న్‌, కెమెరామెన్ అభిరాజ్‌, ఇంకా స‌చిన్‌, అర‌వింద్ స‌హా అంద‌రికీ థాంక్స్‌. మూడేళ్లు అయినా అంద‌రూ స‌పోర్ట్ అందించారు. త్రిష్ణాను కూడా ఫేస్‌బుక్ ద్వారానే క‌లిశాను. ఆమె ఎంతో స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చింది. అనీశ్‌గారికి థాంక్స్‌. నాకు గైడ్‌లా స‌పోర్ట్ చేశారు. రాహుల్‌కి థాంక్స్‌. అలాగే మాకు స‌పోర్ట్ అందించ‌డానికి వ‌చ్చిన ల‌క్ష్మీ మంచు, నాగ్ అశ్విన్‌, చాందిని చౌద‌రికి థాంక్స్‌’’ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: