సినిమా.. రాజకీయాలు.. రెండు వేరు వేరు పనులు. కాని ఆ రెండిటికి చాలా దగ్గర ఇమేజ్ ఉంటుంది. సినిమా గ్లామర్ రాజకీయాలకు.. రాజకీయ నాయకుల పలుకుబడి సినిమాలకు కావాల్సిందే. అందుకే ప్రతి ఒక్క నటుడు ఏదో ఒక పార్టీకి ప్రత్యక్ష, పరోక్ష సపోర్ట్ ఉంటుంది. అయితే ఎన్టీఆర్ పార్టీ పెట్టాక దాదాపు తెలుగు హీరోలంతా ఆయనకు సపోర్ట్ గా నిలిచారు. కాని సూపర్ స్టార్ కృష్ణ మాత్రం రాజీవ్ గాంధి సాన్నిహిత్యంతో కాంగ్రెస్ లోనే కొనసాగారు. వైఎస్ హయాంలో కూడా కాంగ్రెస్ కు సపోర్ట్ గా ఉన్నారు కృష్ణ.

 

అయితే వైఎస్ మరణించాక కాంగ్రెస్ వెనుకపడ్డది.. వైఎస్ వారసుడు వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టి మొదటిసారి అధికారం జస్ట్ లో మిస్ అయినా రెండోసారి మాత్రం భారీ విజయాన్ని అందుకున్నాడు. అయితే వైఎస్ తో సన్నిహితంగా ఉన్న కృష్ణ వైఎస్ తనయుడు జగన్ కు పరోక్ష సపోర్ట్ ఉన్నారని టాక్.  అయితే ఇప్పుడు అందరి చూపు మహేష్ మీద ఉంది. మహేష్ ఎవరికీ సపోర్ట్ ఇస్తున్నాడు. మహేష్ ఏపిలో ఏ పార్టీకి సన్నిహితంగా ఉన్నాడు అన్నది అఫీషియల్ గా ఎవరికి తెలియదు. 

 

రాజకీయాల్లో తనకు అఆలు కూడా తెలియదు అని చెప్పే మహేష్ ఇప్పుడు రాజకీయాల ఆలోచన లేకున్నా ఫ్యూచర్ లో మాత్రం పొలిటికల్ స్టెప్ తీసుకోక తప్పదు. అప్పుడు వచ్చిన వైఎస్ ఫ్యామిలీతో ఉన్న అనుబంధంతో మహేష్ వైసిపికి సపోర్ట్ ఇవ్వడమో లేక వైసిపి తరపున తను రంగంలో దిగడమో జరుగుతుంది. అయితే ముందే ఎలా చెప్పగలం అప్పటికి సమీకరణాలు మారొచ్చు.. అయితే మ్యాక్సిమం మాత్రం మహేష్ వైసిపి తరపున ఉండే అవకాశాలే చాలా ఉన్నాయి. అప్పుడప్పుడు జగన్ తో వైఎస్ టచ్ లో ఉన్నట్టు వార్తలు కూడా తెలిసిందే. మరి మహేష్ పొలిటికల్ స్టెప్ ఎలా ఉండబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: