సినిమా ఛాన్సుల కోసం హీరోయిన్ లు గ్లామర్ షో చేయడం ఫ్యాషన్ అయిపోయింది. అయితే.. వీరు వీరి చేతిలో అవకాశాలు ఉన్నపుడు పాత్రల కోసం ఎవరేమడిగిన కానీ.. పట్టించుకోరు. ఎప్పుడైతే వారి చేతి నుంచి అవకాశాలు తగ్గుతాయో అప్పుడు నేను అన్ని రకాల పాత్రలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. అని అంటూ.. దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు ఈ భామలు హాట్ హాట్ గా ఫోటోలకు సిద్దమయ్యి ఫోజులు ఇస్తుంటారు. 

 

 

 అయితే.. ఇప్పుడు సోనారికది అదే పరిస్థితి. ఈమె తెలుగులో మొదటి చిత్రం. జాదుగాడులో హీరోయిన్ గా సోనారికా నాగశౌర్య పక్కన నటించింది. కాగా., ఈమె తన తెలుగు మొదటి సినిమాతోనే పరిచయం కాదు. ఈమె మనందరికీ ముందే తెలుసు.. ఎలా అనుకుంటున్నారా.?? మా టీవీలో ప్రచారమయ్యే హ హర మహాదేవ సీరియల్ లో నటించారు. శివుని పక్కన పార్వతి దేవిగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసులకు దగ్గరయ్యారు.

 

 

తొలి సినిమా నుంచే తన గ్లామర్ షో చేసి హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. 2015లో నాగశౌర్య నటించిన 'జాదుగాడు' చిత్రంతో హీరోయిన్ గా తెలుగు తెరకి ఎంట్రీ ఇచ్చింది సోనారిక. ఆ తర్వాత ఎఎమ్  స్పీడున్నోడు సినిమాలో నటించారు. ఆ సినిమాలో కూడా ఈ భామ యూ మాత్రం తగ్గలేదని చెప్పాలి. తర్వాత ఈడోరకం ఆడోరకం సినిమాలో విష్ణుకి జంటగా నటించింది. ఆ తర్వాత తెలుగు పరిశ్రమలో ఆమెకి ఆఫర్స్ రాలేదు. 

 

 

 దీంతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. సాన్సీన్ చిత్రంలో తమిళంలోకి తెరంగేట్రం చేస్తూ 'ఇంద్రజిత్' చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు అన్నిటిలో ఈమె అందాలనే నమ్ముకుని ఉందని చెప్పాలి. సోనారిక నటిగా తానేంటో చూపించడంలో ఫెయిల్ అయింది. దీంతో ఆమెని ఎవరూ పట్టించుకోలేదు. ఇక ఆమెకు వచ్చే అవకాశాలకు బ్రేక్ పడ్డట్టయింది. దాదాపు 3 సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంది ఈ సీరియల్ నటి. ఆ గ్యాప్ ను టీవీ సీరియల్స్ ద్వారా ఫుల్ ఫిల్ చేసుకునే పనిలో బిజీ అయ్యింది. తనకి లైఫ్ ఇచ్చిన సీరియల్స్ ని నమ్ముకుంది సోనారిక

మరింత సమాచారం తెలుసుకోండి: