ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ద‌గ్గుబాటి రానాకు జోడీగా ముగ్గురు హీరోయిన్లు న‌టిస్తున్నార‌ట‌. ఈ మ్యాట‌ర్ చూడ‌గానే అంద‌రూ ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌వుతారు. అదేంటి ఆర్.ఆర్.ఆర్ సినిమాలో రానా ఏంటి ?  రానా ప‌క్క‌న ముగ్గురు హీరోయిన్లు ఏంట‌ని అవాక్క‌వుతారు. అయితే ఇది నిజం. బాహుబలి ది బిగినింగ్‌, బాహుబ‌లి ది కంక్లూజ‌న్ లాంటి సినిమాల త‌ర్వాత రాజ‌మౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్‌, టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా న‌టిస్తున్నారు.

 

వీరితో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్ కూడా మ‌రో కీల‌క పాత్ర‌లో నటిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 8వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ డేట్ కూడా అధికారికంగా ప్ర‌క‌టించ‌డంతో సినిమాపై అంచ‌నాలు ఒక్క‌సారిగా స్పీడ్ అయ్యాయి. అయితే ఈ ఆర్ ఆర్ ఆర్‌కు రానాకు లింక్ ఏంట‌ని అనుకోవ‌ద్దు. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమాకు పోటీగా తేజ మరో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఇక్కడ ఆర్ఆర్ఆర్ అంటే రాక్షస రాజ్యంలో రావణాసురుడు’. రానాతో తేజ తీయబోయే సినిమాకు ఇదే టైటిల్ అనుకుంటున్నారట

.

ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు న‌టిస్తున్నార‌ట‌. ఇక రానా - తేజ కాంబోలో వ‌చ్చిన నేనే రాజు నేనే మంత్రి తర్వాత తేజ, రానా కాంబినేషన్‌లో వస్తోన్న రెండో సినిమా ఇది. ఇక చాలా యేళ్ల త‌ర్వాత నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ కొట్టిన తేజ ఆ త‌ర్వాత  బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కించిన ‘సీత’ సినిమా అనుకున్న విజయం సాధించలేదు. దీంతో తేజ మ‌ళ్లీ మంచి క‌థ రెడీ చేసుకుని రానాను ఒప్పించాడ‌ట‌. సురేష్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై సురేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తాడ‌ని స‌మాచారం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: