జూనియర్ ఎన్టీఆర్.. ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అయన తీసిన సినిమాలలో కథ కంటే కూడా అయన నటనకే ఫిదా అవుతారు. తాత తగ్గ మనవడుగా పేరు తెచ్చుకున్న నటుడు ఎన్టీఆర్. డ్యాన్స్ లో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. కథల ఎంపికలో ప్రత్యేక స్థానాన్ని తెచ్చుకున్నాడు. 

 

ఇంకా అలాంటి ఎన్టీఆర్ కు ఎంతమంది అభిమానులు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే అయన నటన అలాంటిది. అయన నటనను చూసి మళ్లీ సీనియర్ ఎన్టీఆర్ ఏ దిగొచ్చాడు అని అనుకున్నారు. అందుకే ఆయనకు కోట్లమంది అభిమానులు అయ్యారు. 

 

అలాంటి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే అనే ప్రశ్న 2019 ఎన్నికల నుండి వస్తుంది. ఎందుకంటే తాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీకి రాజు లేకపోయాడు.. ఇంకొద్ది రోజులు పోతే పార్టీ భూస్థాపితం అయ్యేలా కనిపిస్తుంది. అందుకే.. అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ రావాలి.. పార్టీని చేతిలోకి తీసుకోవాలి అనుకుంటున్నారు.. 

 

కానీ అక్కడ ఉన్న ముసలి రాజు అంత ఈజీగా ఎన్టీఆర్ ని స్వాగితిస్తాడా? అనే ప్రశ్నలు ప్రజలలో కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ ముసలి రాజుకు ఒక కొడుకు ఉన్నాడు.. ఆ కొడుకును రాజకీయ వారసుడుగా ప్రకటించాలి అనుకున్నాడు. కానీ ఏమి ఉపయోగం.. ఆయనకు వర్ధంతికి.. జయంతికి కూడా తేడా తెలియదు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయనకు పప్పు అని పేరు పెట్టేశారు. 

 

అయితే తెలుగు దేశం పార్టీలోకి వచ్చిన రాకపోయినా.. ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అంటున్నారు అయన అభిమానులు. మరి అభిమానుల కోరిక మేరకు రాజకీయాలలోకి వస్తే ఎన్టీఆర్ రాజకీయ జీవితం ఎలా ఉంటుంది? ఆంధ్ర ప్రజల భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: