చైనా దేశంలోని వుహాన్ నగరంలోని ఒక ముసలి వ్యక్తికి కరోనావైరస్ సోకిందని ఆ తర్వాత అది 105 దేశాలకు శర వేగంగా వ్యాప్తి చెందిందని... ఆ 105 దేశాలలో మన భారతదేశం కూడా ఒకటని మనం ఇప్పటి వరకు విన్నాం. అయితే చైనా నుండి వచ్చిన ప్రతిదీ సరిగా పనిచేయదని మనకి తెలుసు. ఇది వైరస్ ల విషయంలో కూడా నిజమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చైనాలో పుట్టిన కరోనా వైరస్ కి మన భారతదేశ వేడి వాతావరణాన్ని తట్టుకునే శక్తి లేదు. అలాగే మన భారతీయులకు ఉన్న రోగ నిరోధక శక్తి కరోనా వైరస్ ని అలవోకగా ఎదుర్కోగలదు.



ఐదుగురికి కరోనా వైరస్ సోకితే వాళ్లలో నలుగురు ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే కరోనా వైరస్ వ్యాధిని స్వతహాగా నయం చేసుకోగల శక్తి వారికి దండిగా ఉంటుంది. మిగిలిన ఐదవ వ్యక్తి తక్కువ రోగనిరోధకశక్తి గల ముసలి వాడు అయితే కరోనా వైరస్ వల్ల అతడి ప్రాణాలు పోవచ్చు. చైనాలో ఇప్పటికే చాలా వేల మందికి నావెల్ కోవిడ్ 19 వ్యాధి పూర్తిగా నయం అయ్యిందన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వలన ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం లేకపోయినా మన భారతీయులు మాత్రం అతిగా శ్రద్ధ తీసుకుంటున్నారని చాలా మంది వైద్యులు అభిప్రాయపడుతున్నారు.



ఏదిఏమైనా కరోనా వైరస్ భయం తో సినిమా పరిశ్రమపై ఎక్కువ ప్రభావం పడుతుంది. ముఖ్యంగా టాలీవుడ్ సినిమాలని చూసేందుకు ఎవరు బయటికి రావడం లేదు. దీంతో బాక్సాఫీస్ వసూళ్లు దారుణంగా తగ్గిపోయాయి. వాస్తవానికి ప్రస్తుతం పరీక్షల సమయం కావడంతో అందరూ చదువుకునే పనిలో ఉన్నారు, సో సినిమాలు చూసేందుకు చాలా తక్కువ మంది థియేటర్లకి వస్తున్నారని తెలుస్తోంది. ఇది తెలుసుకున్న టాలీవుడ్ సినీ నిర్మాత దిల్ రాజు తన వీ సినిమాని ఇప్పట్లో రిలీజ్ చేయనని చెప్పినట్టు కూడా తెలుస్తోంది. ఒకవేళ కరోనా వైరస్ ప్రభావం ఒకటి రెండు నెలల్లో తగ్గితే ఈ వేసవి సెలవల్లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కళ్ళు చెదిరే రీతిలో ఉంటాయి అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: