టాలీవుడ్ హీరో, ద‌గ్గుబాటి వార‌సుడు రానా, స్వీటీ బ్యూటీ అనుష్క‌కు ఇప్పుడు పెద్ద చిక్కే వ‌చ్చి ప‌డింది. వీరిద్ద‌రు ఈ పెద్ద స‌మ‌స్య నుంచి ఎలా గ‌ట్టెక్కుతారా ? అని వీళ్ల అభిమానులు టెన్ష‌న్‌తో ఉన్నారు. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే జీఎస్టీ ఎఫెక్ట్‌తో తమిళ సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు చిక్కులను ఎదుర్కొంటుంది. జీఎస్టీ భారీగా ఉండ‌డంతో సినిమాల‌కు భారీ న‌ష్టాలు వ‌స్తున్నాయ‌ని కొద్ది రోజులుగా ఇండ‌స్ట్రీ అంతా గగ్గోలు పెడుతోంది. ఇక ఈ నెల 27 నుంచి త‌మిళ‌నాడులో ఏ సినిమా కూడా రిలీజ్ చేయ‌మ‌ని ఇప్ప‌టికే త‌మిళ‌నాడు డిస్ట్రిబ్యూటర్ల సంఘం నిర్ణయం తీసుకుంది. కేంద్రం ప్రవేశపెట్టిన 18 శాతం జిఎస్టీ కారణంగా సినిమా ప‌రిశ్ర‌మ‌కు తీవ్ర న‌ష్టాలు వ‌స్తున్నాయ‌ని కొద్ది రోజులుగా వీళ్లంతా గ‌గ్గోలు పెడుతున్నారు.

 

దీనిపై తమిళ సినిమా డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు, దర్శకుడు టీ రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు జీఎస్టీ విష‌యంలో త‌మిళ డిస్ట్రిబ్యూట‌ర్ల సంఘం తీసుకున్న నిర్ణ‌యం అనుష్క, రానాలకు పెద్ద చిక్కుగా ఏర్పడింది. బాహుబ‌లి ది కంక్లూజ‌న్ సినిమా త‌ర్వాత అనుష్క రేంజ్‌కు త‌గ్గ హిట్ సినిమా రాలేదు. ఇప్పుడు ఆమె ఆశ‌లు అన్నీ త్వ‌ర‌లోనే రిలీజ్ కానున్న నిశ్శ‌బ్దం సినిమాపై ఉన్నాయి. అలాగే రానా న‌టించిన అర‌ణ్య కూడా త‌మిళ్‌లో రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఇప్పుడు ఈ రెండు సినిమాలు రిలీజ్ అవుతాయో ?  లేదో ? అన్న సందేహాలు ఉన్నాయి.

 

దీంతో ఇప్పుడు ఈ సినిమాల‌ను ఏం చేయాలా ? అని తెలియ‌క నిర్మాత‌లు త‌లలు ప‌ట్టుకుంటున్నారు. ఏదేమైనా జీఎస్టీ ఎఫెక్ట్ సినిమా ఇండ‌స్ట్రీ అప్పుల ఊబిలో కూరుకుపోతోంద‌ని ఇండ‌స్ట్రీ వాళ్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే థియేట‌ర్ల రెంట్లు, స్థానిక ప‌న్నుల‌తోనే సినిమా ఇండ‌స్ట్రీ బ‌తికి బ‌ట్ట‌క‌ట్టే ప‌రిస్థితి లేదు. ఇక ఫైర‌సీ దెబ్బ కూడా గ‌ట్టిగా ఉంది. ఈ టైంలో జీఎస్టీ ఎఫెక్ట్ నేప‌థ్యంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు త‌మ‌ను ఆదుకోవాల‌ని కోలీవుడ్ పెద్ద‌లు కోరుతున్నారు. ఇక‌ కేరళలో కరోనా ఎఫెక్ట్‌తో థియేటర్స్‌‌ని ఈ నెల 31వరకూ మూసి వేయడంతో.. మోలీవుడ్‌కి కూడా చిక్కులు తప్పేలా లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: