ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అయన నమ్మితే ప్రాణాలు ఇస్తాడు.. నమ్మకంగా ఉంటే ఎదగడానికి సహాయం చేస్తాడు.. స్నేహంగా ఉంటే తారాస్థాయికి తీసుకువెళ్తాడు. అలానే నమ్మిన బంటుగా ఉన్న వల్లభనేని వంశీ రాజకీయ జీవితం కూడా అలానే అయ్యింది.     

 

IHG

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వల్లభనేని వంశీ ఒక సినీ ప్రొడ్యూసర్.. అయితే సినిమాల్లోకి రాకముందు పరిటాల రవి అనుచరుడు. కొడాలి నాని స్నేహితుడు కూడా. కొడాలి నాని.. ఎన్టీఆర్ మంచి స్నేహితులు కావడంతో వల్లభనేని వంశీ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేశాడు.. అదే ''అదుర్స్''. అదుర్స్ సినిమా విడుదలవక ముందే వల్లభనేని వంశీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

 

IHG

 

అయితే 2009 ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరుపున అయన గన్నవరం నుండి పోటీ చెయ్యగా.. అప్పట్లో ఫామ్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లగడపాటి వల్లభనేని వంశీని ఓడించాడు. అయితే ఆ తర్వాత కూడా అదే పార్టీలో కొనసాగి 2014 లో ఘనవిజయం సాధించాడు. ఆ తర్వాత ఎన్నో మంచిపనులు చేసి ప్రజలకు దగ్గరయ్యాడు. 
 

IHG


అందుకే 2019 లో పార్టీ ఓడిపోయినా ఆయన మాత్రం గెలిచాడు. వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఇలా ఎమ్మెల్యే అయినా వల్లభనేని 2019 ఎన్నికల తర్వాత పార్టీ చేసే రచ్చ తట్టుకోలేక ఆ పార్టీ నుండి బయటకు వచ్చాడు. అయన బయటకు వచ్చినట్టు దాదాపు ఖరారైంది. ఇలా ఆయన రాజకీయ జీవితం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: