ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమకు వస్తున్న యువ గాయకులు, సంగీత దర్శకుల్లో కొందరు అలా వచ్చి ఇలా వెళుతుంటే, మరికొందరు మాత్రం తమ ఆకట్టుకునే టాలెంట్ తో ప్రేక్షకుల మదిలో మంచి స్థానాన్ని సంపాదిస్తున్నారు. ఆ విధంగా ప్రస్తుతం ఒక యువ సింగర్, తెలుగు హీరోల పాలిటి కామధేనువుగా మారాడు. అయితే అతను మరెవరో కాదు, సిద్ శ్రీరామ్. తమిళనాడులోని చెన్నైకి చెందిన ఈ యువ గాయకుడు తొలిసారిగా తెలుగులో కడలి సినిమాలోని యాడికే అనే పాట పాడి తన సుమధురంగా గాత్రంతో మన తెలుగు ప్రేక్షకుల మదిని ఆకర్షించాడు.
 

 

ఆ తరువాత విక్రమ్ ఐ లో నువ్వుంటే నా జతగా, అలానే నాగ చైతన్య సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో వెళ్ళిపోమాకే సాంగ్స్ తో యూత్ పల్స్ పట్టుకున్న సిద్ శ్రీరామ్, ఆపై నాని హీరోగా వచ్చిన నిన్ను కోరి సినిమాలోని అడిగా అడిగా సాంగ్ తో మరింత పాపులారిటీ సంపాదించాడు అనే చెప్పాలి. ఇక రెండేళ్ల క్రితం వచ్చిన చిన్న సినిమా హుషారులో ఉండిపోరాదే సాంగ్ పాడిన శ్రీరామ్, ఆ ఒక్క సాంగ్ తో సంగీత ప్రియుల మదిని గెలిచి, గాయకుడిగా విశేషమైన పేరుని గడించాడు. ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ల కాంబోలో వచ్చిన అలవైకుంఠపురములో సినిమాలో సామజవరగమనా సాంగ్ పాడిన శ్రీరామ్, ఆ ఒక్క పాటతో జాతీయ స్థాయిలో ఎనలేని కీర్తి ప్రతిష్టలు గడించాడు. 

 

దానితో పాటు యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా తెరకెక్కుతున్న 30రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలోని నీలి నీలి ఆకాశంతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమా నుండి మూడు రోజుల క్రితం రిలీజ్ అయిన మగువ మగువ సాంగ్ ల సూపర్ సక్సెస్ లతో తెలుగు హీరోల పాలిటి కామధేనువుగా మారిపోయాడు అనే చెప్పాలి. మధ్యలో తమిళ్ తో పాటు కొన్ని మలయాళం సాంగ్స్ కూడా పాడిన శ్రీరామ్, అక్కడ కూడా తన అద్భుతమైన గాన మాధుర్యంతో మంచి పేరు సంపాదించాడు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: