యాంక‌రింగ్ అనేది చాలా రిస్క్ జాబ్ త‌మ అంద‌చందాల‌తో మ‌త్తుజ‌ల్లుతూనే మాట‌ల గార‌డీతో క‌ట్టిప‌డేయ‌డ‌మే యాంక‌రింగ్ స్కిల్‌. చూస్తున్నంత సేపూ వాళ్ళ‌నే క‌ళ్ళ‌న్నీ వెత‌కాలి. ఏం చెప్పినా కూడా జోల‌పాడిన‌ట్లు వినాలి. అప్పుడే బెస్ట్ యాంక‌ర్‌గా గుర్తింపు. ఇలాంటి విష‌యంలో రాటు తేలిపోయిన ముద్దుగుమ్మ‌లు ఎంద‌రో టాలీవుడ్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. ఓ ప‌క్క తెలుగు బుల్లితెర‌ను ఏలుతూనే సినిమాల‌కు వీరు చేసే స‌హాయం అంతా ఇంతా కాదు. బుల్లితెర, వెండితెర అన్న తేడాలేకుండా అన్నీ వ‌చ్చిన అవ‌కాశాన్ని చేజిక్కించుకుంటూ వీళ్ళు తీసుకునే పైకం కూడా ఏమీ త‌క్కువేమి కాదు. అంటే... ఇప్పుడున్న టాప్ యాంక‌ర్స్‌లో ఎవ‌రికి ఎంత రెమ్యూన‌రేష‌న్స్ వ‌స్తాయో ఇప్పుడు చూద్దాం...

 

తెలుగులో హైరేంజ్‌లో ఉన్న యాంక‌ర్లు అప్ క‌మింగ్ యాంక‌ర్ల రేంజ్ ఏంటో అని ఆరాతీస్తే...క‌ళ్ళు బ‌య‌ర్లు క‌మ్మే నిజాలు తెలిశాయి. ఏదో ఎగేసుకు వ‌చ్చి యాంక‌ర్ అయిపోవాలంటే ప‌ప్పులో కాలేసిన‌ట్లే. వీళ్ళ‌కు చాలా స్కిల్స్ అవ‌స‌రం స్టేజ్ పెర్‌ఫార్మెన్స్‌లో ఎలాంటి బెరుకు ఉండ‌కూడ‌దు. ఇక వీళ్ళ మెయిన్‌టెనెన్స్ కూడాకాస్త ఎక్కుడే కాబ‌ట్టి అందుకే పారితోషికాలు ఆరేంజ్‌లో ఉంటాయ‌ని స‌ర్వేలో తేలింది. ఇక ఇండ‌స్ట్రీ బెస్ట్ యాంక‌ర్ ఎవ‌రో ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. యాంక‌ర్ సుమ సుమారు 5నుండి 6 ల‌క్ష‌ల‌వ‌ర‌కు తీసుకుంటుంది. ఇక భారీగా అవార్డుల వంటి ఫంక్ష‌న్ల‌యితే ఇంకా పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తుంద‌ట‌. స్వ‌త‌హాగానే మంచి మాట‌కారి అయిన ఈ మ‌ల‌యాళి భామ తెలుగింటి హాసినిలా బాగా ఫేమ‌స్ అయింది. ద‌శాబ్దాల అనుభ‌వం ఉండ‌డంతో త‌న‌దైన శైలితో చ‌మ‌క్కులు విసురుతూ ఆహుతుల‌ను బోల్తా కొట్టించ‌డంలో బ‌హు నేర్ప‌రి అని చెప్ప‌వ‌చ్చు. అందుకే ఈమె అడిగినంత ఇచ్చేయాల్సిందే.

 

 ఇంక ఆ త‌ర్వాత ఆ రేంజ్ యాంక‌ర్ ఎవ‌రంటే అన‌సూయ మాత్ర‌మే. జ‌మ‌ర్ద‌స్త్ ముందు కంటే అన‌సూయ గ్లామ‌ర్ యాంక‌రింగ్ పీక్స్‌లో అలాగే రంగ‌మ్మ‌త్త‌గా పాపుల‌రిటీ అన్న‌ది అసాధార‌ణం. అందుకే ఈ భామ‌కి ఒక్కోఈవెంట్‌కి మూడు ల‌క్షలు వ‌ర‌కు తీసుకుంటుంద‌ట‌. ఇక అదే జ‌బ‌ర్ద‌స్త్ షోతో వ‌య్యారాలు వ‌డ్డ‌న చెయ్య‌డంలో ముందుంట‌ది. ఇక కిర్రాక్ యాంక‌ర్‌గా పాపుల‌ర్ అయిన ర‌ష్మి రెండు ల‌క్ష‌ల వ‌ర‌కు తీసుకుంట‌ద‌ట‌. ఇక యాంక‌ర్ శ్యామ‌ల బిగ్‌బాస్‌తో ఎంత ఫేమ‌స్ అయ్యిందో తెలిసిందే. ఈ భామ ఒక్కో ఈవెంట్‌కి ల‌క్ష తీసుకుంట‌ద‌ట‌. ఇటీవ‌లె డింపుల్ మెరుపుల‌తో మెరుస్తూ బ్యూటీగా అల‌రిస్తున్న మంజూష 50 నుండి 70వేల వ‌ర‌కు అందుకుంటుంద‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: