అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నా గాని వాటితో సంబంధం లేకుండా అల్లు శిరీష్ కి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. నిర్మాతలు మరియు దర్శకులు అల్లు శిరీష్ తో సినిమాలు చేయటానికి ఆసక్తి చూపిస్తూనే ఉన్నారు. అయితే చేస్తున్న సినిమాలు వరుసగా బాక్సాఫీసు వద్ద బోల్తా పడటం జరుగుతున్న నేపథ్యంలో కాస్త ఆలస్యమైనా ఆచితూచి సరైన హిట్ కొట్టాలి అన్న ఉద్దేశంతో నల్లగా సినిమాలు చేస్తున్నాడు. మెగా కాంపౌండ్ లో ఏ హీరో తీసుకొని చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న అల్లు శిరీష్ ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అంటూ మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

 

ఇటువంటి తరుణంలో తమిళ సినిమా రంగంలో సూపర్ డూపర్ హిట్ అయిన ఒక తమిళ్ రీమేక్ సినిమాకు అల్లు శిరీష్ ఓకే చెప్పినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాలో స్క్రిప్ట్ మరియు స్క్రీన్ ప్లే దగ్గరుండి రాయించారట. తెలుగు స్క్రిప్ట్ రెడీ చేసింది మరెవ్వరో కాదు దర్శకుడు రాకేశ్ శశి. స్క్రిప్ట్ కు ఇంప్రెస్ అయిన అల్లు శిరీష్ దర్శకత్వ బాధ్యతలు కూడా ఆయనకే ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. రాకేశ్ శశి దర్శకత్వంలో జతకలిసే, విజేత అనే రెండు సినిమాలు తెరకెక్కడం జరిగింది.

 

రెండు సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయాయి. ముఖ్యంగా విజేత చిత్రంతో దారుణమైన ఫ్లాప్ ను మూటకట్టుకున్నాడు. మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలు చేశాడు. ఇప్పుడు అదే దర్శకుడికి అల్లు శిరీష్ రీమేక్ దర్శకత్వ బాధ్యతలు అప్పగించడంతో ఈ విషయం మెగా కాంపౌండ్ లో పెద్ద హాట్ టాపిక్ అయింది. అయితే తెలుగులో స్టోరీ మార్చిన విషయాన్ని స్క్రిప్టు మొత్తం విన్న మెగా కాంపౌండ్ హీరోలు ఈ సారి మాత్రం అల్లూ శిరీష్ హిట్ కొట్టకుండా ఎవ్వరూ ఆపలేరు అని కామెంట్ చేస్తున్నారని టాక్. సినిమా యొక్క స్క్రిప్ట్ అంత బాగా రాశాడు అంట రాకేశ్ శశి అందువల్లే ఖచ్చితంగా ఈసారి అల్లు శిరీష్ విజయం సాధిస్తారని మెగా హీరోలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: