తెలుగు సినిమా రంగంలో కుర్ర హీరో శర్వానంద్ కి మంచి క్రేజ్ ఉంది. ‘ప్రస్థానం’ సినిమా లో సాయికుమార్ పక్కన శర్వానంద్ నటించిన నటనకు చాలామంది ఇండస్ట్రీలో ఉన్నవాళ్లే ఫిదా అయిపోయారు. అయితే కెరీర్ పరంగా ఎన్నో ఎత్తు పల్లాలు కూడా చూడటం జరిగింది. ముఖ్యంగా మహానుభావుడు సినిమా తర్వాత వరుసగా శర్వానంద్ చేసిన సినిమా 3 బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ప్రస్తుతం రెండు సినిమాలు చేయటానికి రెడీగా ఉన్నాడు. అయితే వరుసగా చేసిన సినిమాలు ఫ్లాప్ అవుతున్న గాని రెమ్యూనరేషన్ విషయంలో శర్వానంద్ ఎక్కడా తగ్గడం లేదట. అలాగే మరో పక్క అవకాశాలు కూడా వరుసగా రావడంతో ఈ సినిమా కోసం ఏకంగా ఏడు కోట్లకు తగ్గటం లేదట.

 

దీంతో శర్వానంద్ రెమ్యూనరేషన్ రేటు తెలుసుకుని చాలా మంది టాలీవుడ్ ఇండస్ట్రీ నిర్మాతలు వెనకడుగు వేసినట్లు టాక్. లేటెస్ట్ గా చేస్తున్న శ్రీకారం సినిమాకు 14రీల్స్ ప్లస్ నిర్మాతలు ఇదే ఫిగర్ ఇచ్చారని బోగట్టా. దీంతో శర్వానంద్ తో సినిమా చేయాలని ఏ నిర్మాత అయినా అనుకున్న ఖచ్చితంగా రెమ్యూనరేషన్ ఏడు కోట్లు ఇవ్వాల్సిందే. అంతే కాకుండా కేవలం రిజర్వేషన్ విషయంలో మాత్రమే సమస్య కాదు శర్వానంద్ తో చేసే ప్రాజెక్టు విషయంలో కూడా చాలా టైం తీసుకుంటారన్నది ఇండస్ట్రీ శర్వానంద్ పై మచ్చ ఉంది. చాలా లీజర్ గా సినిమా చేయడం అన్నది శర్వా స్టయిల్. షెడ్యూలు, షెడ్యూలుకు గ్యాప్ తీసుకుంటాడు. ఇప్పుడు చేస్తున్న 'శ్రీకారం' కూడా ముందు అనుకున్న డేట్ కు రెడీ కాలేక వాయిదా పడింది.

 

శర్వానంద్ కి నటన పరంగా మంచి పేరు ఉంది, అదే విధంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి శర్వానంద్ అంటే బాగా ఇష్టం, అదే టైములో యూత్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇటువంటి అవకాశాలు ఉన్నా శర్వానంద్...తన రెమ్యూనరేషన్ విషయంలో కొద్దిగా ఆలోచిస్తే బాగుంటుంది అన్న టాక్ బలంగా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఈ క్రమంలో రెమ్యూనరేషన్ విషయంలో, సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కదా అని కొద్దిగా తేడా చేసినా ఇటీవల ఇన్కమ్ టాక్స్ అధికారులు ఎక్కువ సౌత్ ఇండియా నటీనటుల పైన ఫోకస్ పెడుతున్నారు, తేడా జరిగితే మాత్రం రిస్క్ అయిపోయే చాన్స్ ఉంది చూసుకో శర్వానంద్ అని చాలామంది ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు సలహాలు ఇస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: