మెగాస్టార్ చిరంజీవి ... ఆయన సినీ జీవితంలో ఎన్నో ముళ్ళ బాటలని, రాళ్ళ బాటలని వెనక తరానికి పూల బాటగా మార్చిన గొప్ప వ్యక్తి. ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ లాంటి స్టార్ హీరోలని తట్టుకొని స్వయం కృషితో సినిమా ఇండస్ట్రీలో నెగ్గుకురావడమే కాదు మెగాస్టార్ గా చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. ఆయన ఒక చిన్న పాత్రతో సినీ రంగ ప్రవేశం చేసి నెమ్మదిగా క్యారెక్టర్స్ చేసుకుంటూ ఖైదీ సినిమాతో తిరుగులేని స్టార్ డం ని సొంతం చేసుకున్నారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన చిరంజీవి సుప్రీం హీరోగా ఫేమస్ అయ్యారు. ఇది నిజంగా ఎంతో గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. ఇండస్ట్రీలో ఎలాంటి రక్త సంబధం లేకుండా గాడ్ ఫాదర్ అనేవాళ్ళు లేకుండా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ కేవలం తనమీద తనకున్న నమ్మకం, నటన, కళామతల్లి మీద ప్రేమ అభిమానాలే చిరంజీవిని సుప్రీం హీరో నుండి మెగాస్టార్ గా మార్చింది. 

 

పూర్తిగా నటన, డాన్స్, ఫైట్స్ ...వీటితోనే కోట్ల మందికి అభిమాన నటుడయ్యారు చిరంజీవి. అంతేకాదు అదే కోట్ల మందికి అన్నయ్య అయ్యారు. అక్కున చేర్చుకొని చూపులేని వాళ్ళకి చూపుని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి రక్తదానంతో ప్రాణాలని పోసిన దాత. అందుకే చిరంజీవి నటుడిగానే కాదు ఒక వ్యక్తిగా, శక్తిగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమలో అందరికి పెద్ద దిక్కుగా ఉంటూ అందరి సమస్యలని తీరుస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరిని ఎంకరేజ్ చేస్తూ దాసరి నారాయణగారు స్థానాన్ని భర్తీ చేసి ఆయన లేని లోటుని తీరుస్తున్నారు.

 

ఇక చిరంజీవిని ఒక పెద్దావిడ నా సొంత కొడుకు లాంటి వాడు ..ఇంకా చెప్పాలంటే నాకు కొడుకే అంటూ ప్రేమ అభిమానాలని కురిపిస్తున్నారు. ఆ పెద్దావిడకి కొడుకు, కూతుళ్ళు ఉన్నా కూడా చిరంజీవి నా సొంత కొడుకు అంటూ గుండెల్లో దాచుకున్న నిజాన్ని బయట పెట్టారు. ఇంతకీ ఆవిడ ఎవరో కాదు ప్రముఖ హాస్య నటులు పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి సతీమణి శ్రీ అల్లు కనకరత్నంగారు. చిరంజీవిని అల్లుడిగా చేసుకోవాలని అనుకున్నప్పుడు అప్పటి వరకు సినిమాలలో చూసిన కనకరత్నంగారు పెళ్ళి చూపులప్పుడు నేరుగా చూడగానే అల్లుడు కాదు నాకు నా కొడుకులాగే అనిపించాడని పట్టరాని సంతోషాన్ని వ్యక్తపరచారు. ఆ అబ్బాయి మా ఇంటి అల్లుడవడం మా అమ్మాయి చేసుకున్న అదృష్ఠం అంటూ ఆనందంగా తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: