టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లైఫ్ స్టైలే వేరు. ప్రతి సినిమాలో బన్నీ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి అన్నీ స్ఫెషలే. పూరి జగన్నాధ్ తో చేసిన ఇద్దరు అమ్మాయిలతో సినిమాలో కాస్ట్యూమ్స్ అన్నీ సింగపూర్ లో బన్నీ స్పెషల్ గా వెళ్లి కొన్నాడని టాక్ ఉంది. బన్నీ తన ప్రతి సినిమాలో కూడా తన లుక్ మార్చేస్తూంటాడు. చేసే ప్రతి సినిమాలో తన లుక్ డిఫరెంట్ గా ఉండడమే కాదు.. హెయిర్ స్టైల్ కూడా మార్చేస్తూంటాడు.

IHG

నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమాకు పూర్తిగా మిలిటరీ ఆఫీసర్ గా బాడీ ఫిజిక్ తో పాటు హెయిర్ స్టైల్ కూడా మారిపోవడమే ఇందుకు ఉదాహరణ. ప్రతి సినిమాలో కూడా తన ఆహార్యంతో పాటు సినిమా మేకింగ్ కూడా మార్చేస్తూంటాడు. రీసెంట్ గా వచ్చిన అల.. వైకుంఠపురములో సినిమా అంత స్టైలిష్ గా రావడానికి కారణం బన్నీ ఆలోచనలే. ఈ సినిమాలో తన హెయిర్ స్టైల్ కూడా తొంభయ్యో దశకంలో హీరోల స్టైల్లో ఉంటుంది. తర్వాత సుకుమార్ దర్శకత్వంలో చేసే సినిమాకు కూడా తన ఆహార్యం, మాటల్లోని యాస కూడా మారిపోబోతోంది. చిత్తూరు జిల్లా యాస కోసం ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడట బన్నీ.

IHG

 

తను వాడే కార్లు, ఇల్లు, ఫర్నీచర్, క్యారవాన్.. అన్నీ బన్నీ స్టైల్లో ఉండాల్సిందే. షూటింగ్ ల్లో సేద తీరేందుకు ఇటివల తీసుకున్న క్యారవాన్ ఖరీదు 7కోట్ల రూపాయలని సమాచారం. ఇంత ఖరీదైన క్యారవాన్ సౌత్ ఇండియాలో ఏ హీరోకి లేదట. ప్రస్తుతం బన్నీ కొత్త ఇల్లు కట్టుకుంటున్నాడు. దేశంలో మరే హీరోకు లేనటువంటి అత్యాధునిక సౌకర్యాలతో ఆ ఇల్లు కట్టుకోబోతున్నాడట బన్నీ. చిన్నప్పటి నుంచీ బన్నీ లైఫ్ స్టైల్ ఇలానే ఉండేదని అల్లు అరవింద్ కూడా చెప్పడం ఇక్కగ గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: