"అమ్మాయి గారు మీ నవ్వు చాలా బాగుంటుందండి "ఇప్పుడు ఎక్కడ చుసిన వినిపించే పేరు అమ్మాయిగారు. 30 రోజుల్లో ప్రేమించడం ఏలా !!అనే సినిమాలో హీరోయిన్ ఈ అమ్మాయిగారు.. ఆ హీరోయిన్ అసలు పేరు అమృత అయ్యర్. కుర్రకారుని ప్రస్తుతం ఆకర్షిస్తుంది ఈ తమిళ భామ.. అమృత అయ్యర్ భారతీయ చిత్ర నటి, తమిళ సినీ పరిశ్రమలో ప్రధానంగా పనిచేసింది.. బిగిల్, కాళి వంటి ప్రముఖ సినిమాల్లో పనిచేశారు.

 

ఆమె థియేటర్లలోకి వచ్చిన మునుపటి చిత్రం బిగిల్ 2019 సంవత్సరంలో. బిగిల్ లో కెప్టెన్ థెండ్రాల్ పాత్ర పోషించింది. గ్రామీణ చిత్రంలో వినయ్ రాజ్‌కుమార్‌తో కలిసి అమృత కన్నడలో అరంగేట్రం చేసింది.తాజాగా అమృత అయ్యర్ “30 రోజుల్లో ప్రేమించటం ఎలా ?” మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అవుతున్నారు. ప్రముఖ యాంకర్ ప్రదీప్ హీరోగా పరిచయం అవుతున్న ఆ మూవీ మార్చి 25 వతేదీ రిలీజ్ కానుంది.

 

ఈ సినిమాలోని నీలి నీలి ఆకాశం పాట ఇప్పటికే శ్రోతల్ని ఉర్రుతలూగిస్తుంది.తర్వాత ఈ భామ కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా రూపొందుతున్న “రెడ్ ” మూవీ లో కూడా నటిస్తుంది.అయితే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరిగా అమృత ఎంపిక అయ్యారు. ఇప్పుడు మరో మూవీ కి అమృత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది...చిత్ర పరిశ్రమలోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తుంటారు. గ్లామర్, నటనతో మెప్పిస్తే వారికి గుర్తింపు దక్కుతుంది. కొంత అదృష్టం కూడా తోడై హిట్స్ పడితే కొత్త భామలు స్టార్ హీరోయిన్స్ గా దూసుకుపోతారు.

 

అమృత అయ్యర్ గత ఏడాది విడుదలైన బిగిల్ చిత్రంతో గుర్తింపు సొంతం చేసుకుంది....చిత్రంలో అమృత కీలక పాత్రలో నటించింది....ప్రస్తుతం అమృత టాలీవుడ్ లో రెండు చిత్రాల్లో నటిస్తోంది..ఈ రెండు చిత్రాలు విజయం సాధిస్తే అమృత అయ్యర్ టాలీవుడ్ లో దూసుకుపోవడం ఖాయం అనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.

 

ప్రస్తుతం ఈ భామ ఇప్పుడు అట్రాక్షన్ గా ఉంది. అయితే అమృత మాత్రం గ్లామర్ షోకు దూరంగా ఉంది...కేవలం తన క్యూట్ లుక్స్ తోనే యువతని ఆర్షిస్తోంది.ఈ తమిళ బ్యూటీ అందానికి నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు....తాజాగా అమృత సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ షేర్ చేసింది.ఈ ఫొటోస్ లో అమృత ఎక్కడ కూడా గ్లామర్ ఒలకపొయ్యలేదు.. పోద్దికగా, చాలా క్యూట్ గా నెటిజన్లను ఆకర్షిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: