బాహుబలి ప్రాంచైజీ తో పాన్ ఇండియా స్టార్ గా ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగాడు రెబల్ స్టార్ ప్రభాస్. అయితే ఆ తర్వాత మాత్రం ఆ స్థాయి లో సక్సస్ ని అందుకోలేకపోయాడు. భారీ అంచనాలతోనే సాహో విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని  ఏదో చేయాలనుకొని చివరికి ఏదో చేసారు ప్రభాస్ నిర్మాతలు. సినిమా స్టార్టింగ్ టైం లో ఓ మ్యూజిక్ డైరెక్టర్ అనుకోని ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని వద్దనుకొని పోస్టర్స్ లో ఎవరి పేరు వేయకుండా హైడ్ చేసారు. దీంతో సాహో మ్యూజిక్ అంతగా క్లిక్ అవ్వలేదు. నిర్మాతలు అనుకునంతగా సాహో సినిమాలోని  మ్యూజిక్ జనాలని ఆకట్టుకోలేదు. సినిమాలో విజువల్ గా కాస్త బెఋఅని ఫీలయినప్పటికి కానీ బయట వింటే మాత్రం ఒక్క ముక్క అర్థం కాక ఆడియో ఫ్లాప్ అన్న మాట వినిపించింది. ఒకరకంగా సాహో మ్యూజిక్ విషయంలో మేకర్స్ చేసింది పెద్ద తప్పు అని చెప్పాలి. 

 

అయితే ఇప్పుడు మరోసారి అదే తప్పు చేస్తున్నారు నిర్మాతలు. ప్రభాస్ నెక్స్ట్ సినిమాకు మ్యూజిక్ ఎవరనేది ఇంత వరకూ బయటికి రాలేదు. అసలు ఎవరు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారో మీడియా వాళ్ళకి కూడా తెలియదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే కాదు షూటింగ్ విషయంలో కూడా అంతగా క్లారిటీ ఉండటం లేదు. ఆల్రెడీ పూజా హెగ్డే మూలాన ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ క్యాన్సిల్ అయింది. అప్పుడు కొంత నష్టం జరిగిందని అంటున్నారు.

 

ఇదిలా ఉంటే ఇప్పుడు భారీగా సెట్టింగ్స్ వేసి కూడా కొంత ఎక్కువగా ఖర్చు చేస్తున్నారట. ఇవన్ని సినిమాకి తర్వాత గట్టిగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇప్పటి నుంచైనా మేకర్స్ పక్కా ప్లాన్ తో సినిమాని నిర్మిస్తే బావుంటుందన్న టాక్ నడుస్తోంది. అయితే ఇవేవి ప్రభాస్ పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ వెళుతున్నాడట. మరి అలాంటప్పుడు మేకర్స్ ఇంకా ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒకసారి జరిగిన తప్పుని ఇమకోసారి ఎవరూ చేయరు కదా.

 

అందుకే ఫ్యాన్స్ మేకర్స్ ని ఉద్దేశించి ప్రభాస్ ని తన కెరీర్ ని నాశనం చేయడానికే తయారయ్యారా అందరూ ..! అంటూ మేకర్స్ మీద ఫైర్ అవుతున్నారట. వీళ్ళే కాదు ప్రభాస్ డియరెస్ట్ బ్యూటీ అనుష్క కూడా ఇదే ఫీలవుతూ ప్రభాస్ చాలా సాఫ్ట్ పర్సన్ ఎందుకు అందరూ ఇలా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు అంటుందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: