హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడు, చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ కి మేనల్లుడు, అల్లు అరవింద్ పుత్రుడు అయిన అల్లు అర్జున్ అంటే ఇప్పుడు తెలియని వారు ఎవరు ఉండరు.. స్టైలిష్ హీరో ఐకాన్ అల్లు అర్జున్. మొట్టమొదట చిరంజీవి తో డాడీ సినిమాలో ఒక డాన్సర్ పాత్రలో నటించి తన సత్తా చూపాడు. తర్వాత గంగోత్రి మూవీతో హీరో గా ఎంట్రీ ఇచ్చి, విభిన్న సినిమాలతో స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్.. తాజాగా అలవైకుంఠపురంలో మూవీతో సంక్రాంతికి మెగా హిట్ అందుకున్నాడు.

 

అల్లు అర్జున్ గూర్చి కొన్ని ఆసక్తి కర విషయాలు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, కేరళలో అల్లు అర్జున్ కు అభిమానులున్నారు. ఫేస్ బుక్ లో సుమారు కోటి మంది అభిమానులున్నారు అల్లు అర్జున్ కి. కేరళ లో ఉన్న అల్లు అర్జున్ అభిమానులు బన్నీ ని మల్లు అర్జున్ అని పిలుస్తారట.. టాలీవుడ్ హీరోకి కేరళలో అభిమానులు ఉన్నారంటే అతని క్రెజ్ గూర్చి చెప్పాలిసిన పనిలేదు.. అల్లు అర్జున్ మొదటి చిత్రం కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి.ఈ సినిమాలో "మావయ్యది మొగల్తూరు, మా నాన్న ది పాలకొల్లు "పాటలో లేడీ గెట్ అప్ లో నటించి అందరిని ఆకర్షింపచేసాడు..

 

సందర్భం వచిన్నప్పుడల్లా మావయ్య చిరంజీవి గూర్చి గొప్పగా చెబుతూనే ఉంటాడు. అల్లు అర్జున్ ఫాషన్ మరియు స్టైల్ కు పెట్టింది పేరు అని చెప్పవచ్చు. చిన్నప్పటి నుంచే అర్జున్ డ్యాన్స్ మీద అమితాసక్తిని కనబరిచేవాడు. ఇంట్లో ఏదైనా శుభసందర్భాల సమయంలో చిరంజీవి కుమారుడైన రామ్‌చరణ్ తేజ్, అర్జున్ చిన్నతనంలో నృత్యాలలో పోటీలు పడి మరి చేసేవారు. మొదట్లో అర్జున్ నటుడు కావడానికి తల్లి కొద్దిగా సందేహించినా, తరువాత కుమారుని కోరికను కాదనలేకపోయింది.

 

ఇతని వివాహము హైదరాబాదుకు చెందిన స్నేహారెడ్డితో జరిగింది. వీరికి అయాన్ అనే కుమారుడు,అర్హ అనే కుమార్తె ఉన్నారు.అల్లు అర్జున్ ని అభిమానులు స్టయిలిష్ స్టార్ అని పిలుస్తారు...ప్రోఫెషనల్ గా ఎంత స్టైలిష్ గా ఉంటాడో,రెగ్యులర్ లైఫ్ లోనూ అంతే స్టైలిష్ మెయింటేన్ చేస్తాడు.



తెరపై బన్ని కాస్ట్యూమ్ సెలక్షన్ కి ఫిదా అవ్వని వారు ఉండరు. కేవలం దుస్తుల ఎంపిక ఒక్కటే కాదు, బాడీ లాంగ్వేజ్ లోనూ బన్నిలో స్టైల్ మిళితం అయివుంటుంది.క్యాజువల్ వేర్.డిజైనర్ వేర్ ఏది ధరించినా ప్రత్యేకంగా తన స్టైల్ ని ఎలివేట్ అయ్యేలా చూసుకుంటాడు.గంగోత్రి-అల వైకుంఠపురములో మధ్య హిట్స్ ఫ్లాప్స్ ఎన్నో చూసాడు.హిట్ కి పొంగిపోలేదు.. ప్లాప్ కి కుంగిపోలేదు అల్లు అర్జున్.



మరింత సమాచారం తెలుసుకోండి: