సౌత్ హీరోయిన్స్ లో సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెల్లాల్సిన అవసరం లేదు. అందం అభినయం రెండు ఉన్న ఈ అమ్మడు తెలుగు తమిళ భాషల్లో సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది. ఎలాంటి పాత్ర అయినా సమంత చేస్తుంది అంటే అది సూపర్ హిట్ అన్నట్టే. సినిమాలో చిన్న పాత్ర అయినా సరే అది సమంత చేస్తేనే బాగుంటుంది అంటే ఆమెను తీసుకుంటారు. మాములుగా అయితే పెళ్లి తర్వాత హీరోయిన్స్ కు క్రేజ్ తగ్గుతుంది. కాని సమంత మాత్రం ఆ విషయంలో లక్కీ అని చెప్పొచ్చు. 

 

పెళ్లి తర్వాత కూడా అమ్మడు వరుస సినిమాలు చేస్తుంది. తెలుగులో ప్రయోగాలు చేస్తున్న సమంత తమిళంలో మాత్రం కమర్షియల్ సినిమాల్లో నటిస్తుంది. అయితే తమిళంలో తన స్థానాన్ని ఆక్యుపై చేయాలని చూస్తుంది క్రేజీ హీరోయిన్ పూజా హెగ్దే. ప్రస్తుతం తెలుగులో సూపర్ ఫామ్లో ఉన్న ఈ అమ్మడు తమిళ ఆఫర్లు కొట్టేస్తుంది. లేటెస్ట్ గా సమంత చేయాల్సిన ఒక ప్రాజెక్ట్ పూజా హెగ్దే చేతికి వచ్చినట్టు తెలుస్తుంది. 

 

విజయ్ హీరోగా చేస్తున్న సినిమాలో ముందు సమంతని హీరోయిన్ గా అనుకున్నారట. కాని మళ్ళీ ఏమైందో ఏమో కాని సమంత స్థానంలో పూజా హెగ్దేని సెలెక్ట్ చేశారట. పూజా హెగ్దే 8 ఏళ్ల క్రితం తమిళ సినిమా చేసింది. జీవ హీరోగా చేసిన మాస్క్ లో పూజా హెగ్దే నటించింది. అయితే ఆ తర్వాత తెలుగులో బిజీ అవడడంతో అక్కడ సినిమాలు చేయలేదు. తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు ఇప్పుడు తమిళంలో కూడా రెచ్చిపోనుంది. పూజా టైం ఓ రేంజ్ లో నడుస్తుందని చెప్పొచ్చు. స్టార్ సినిమాకు కావాల్సిన గ్లామర్ షో చేస్తున్న పూజా రానున్న రోజుల్లో మరింత పాపులారిటీ తెచ్చుకునే అవకాశం ఉంది. ఆమె అవకాశాలు కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: