రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ టైటిల్ పై ఇప్పటికీ కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది ఈ మూవీ దేశంలోని అనేక భాషలలో విడుదలవుతున్న పరిస్థితులలో అన్ని భాషల ప్రేక్షకులకు అర్థం అయ్యే టైటిల్ గురించి రాజమౌళి ఆలోచనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో ‘బాహుబలి’ మూవీ ప్రాజెక్ట్ తో నేషనల్ సెలెబ్రెటీ స్థాయికి ఎదిగిపోయిన రానా రాజమౌళి కూడ ఊహించని విధంగా ‘ఆర్ ఆర్ ఆర్’ టైటిల్ ను కబ్జా చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ న్యూస్ గా మారింది.


రానా తేజా ల కాంబినేషన్ లో త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న మూవీకి కూడ ‘ఆర్ ఆర్ ఆర్’ అనే వర్కింగ్ టైటిల్ ఫిక్స్ కాబోతోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీకి ‘రాక్షస రాజ్యంలో రావణాసురుడు’ అన్న టైటిల్ ఇప్పుడు తేజా ఫిలిం ఛాంబర్ లో రిజిష్టర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ టైటిల్ లో కూడ మూడు ‘ఆర్ ఆర్ ఆర్’ లు ఉండటంతో ఇప్పుడు మరో ‘ఆర్ ఆర్ ఆర్’ రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ కు పోటీగా రాబోతోంది అంటూ జోక్స్ పడుతున్నాయి.


గతంలో రానా తేజా లు కలిసి తీసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ మూవీ కథలా ఈ మూవీ కథ కూడ వర్తమాన రాజకీయాల చుట్టూ తిరుగుతుందని టాక్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీఫియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ఈచిత్రాన్ని కూడా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో డి.సురేష్ బాబు నిర్మించనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో రానా మరోసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ మూవీలో రానా పక్కన ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని టాక్. వీరు ముగ్గురు కూడ టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన టాప్ హీరోయిన్స్ అని అంటున్నారు.


ప్రస్తుతం రానా హీరోగా నటించిన ‘అరణ్య’ విడుదలకు రెడీ అవుతోంది. సాయి పల్లవితో కలిసి నటిస్తున్న ‘విరాట పర్వం’ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలు మాత్రమే కాకుండ సుమారు  300 కోట్ల బడ్జెట్ తో గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తీయబోతున్న ‘హిరణ్యకశ్యప’ కు సంబంధించిన భారీ సెట్స్ నిర్మాణం ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ స్టూడియోస్ లో జరుగుతోంది. ఇలా రానా అమెరికా నుంచి తిరిగి వచ్చిన తరువాత సినిమాల విషయంలో తీస్తున్న పరుగులు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారుతున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: