స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంత గొప్పగా నటిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయన తీసే ప్రతి సినిమా ఒక అద్భుతమే. కొన్ని కొన్ని సినిమాల్లో కథలు బాగాలేకపోయిన అయన నటనతోనే సినిమాకు మంచి మార్కులు పడుతాయి. ఇకపోతే కథ బాగుండి అయన నటన కూడా బాగున్నా సినిమాలు అయితే మళ్లి మళ్లి చుడాలి అనిపిస్తాయి. అలా చూడాలి అనిపించే సినిమాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.. 

 

ఆర్య.. 

 

సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఈ సినిమా అప్పటి యూత్ ను ఇప్పటి యూత్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది కాబట్టి. ఈ సినిమాను చూస్తే మళ్లీ మళ్లి చూడాలి అనిపిస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. 

 

హ్యాపీ.. 

 

అబ్బా.. ఈ సినిమాలో ప్రతి మాట నవ్వు తెప్పిస్తుంది.. పిజ్జా బాయ్ గా కనిపించి డాక్టర్ చదవాలి అనుకునే అమ్మాయికి ఎలా సాయం చేశాడు.. అసలు వాళ్లకు అనుకోని రీతిలో పెళ్లి అవ్వడం.. అబ్బో ఈ సినిమా సూపర్ అంటే సూపర్ అంతే. కరుణాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్టు అంటే నమ్మండి. 

 

దేశముదురు.. 

 

దేశముదురు అయినా పూరి జగన్నాథ్ ఈ సినిమాను తెరకెక్కించాడు.. ఈ సినిమాలో హన్సిక ను ఓ దేవతలా చూపించాడు అంటే నమ్మండి. ఈ సినిమాలో అయితే అల్లు అర్జున్ ఓ రేంజ్ లో రెచ్చిపోయాడు.. ఈ సినిమాను కూడా మళ్లి మళ్లి చూడాలి అనిపిస్తుంది. అంత గొప్పగా ఉంటుంది ఈ సినిమా. 

 

పరుగు.. 

 

సినిమా మంచి హిట్ అందుకుంది. తండ్రికి కూతుర్లకు ఎంత ప్రేమ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి అద్భుతమైన ప్రేమ ఉన్న తండ్రిని కాదు అని ప్రేమించినవాడితో లేచిపోయిన అక్క గురించి సినిమా అంత ఉంది. ఆ సినిమా అంత సూపర్ హిట్టే.. 

 

ఆర్య 2.. 

 

ఈ సినిమాను సేమ్ దర్శకుడు... సుకుమార్ తెరకెక్కించాడు. అయితే ఆర్య సినిమా ఉన్న అంత గొప్పగా ఆర్య 2 లేదు. అందుకే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే బన్నీ ఫ్యాన్స్ కు మాత్రం ఈ సినిమా సూపర్ హిట్టే.. ఈ సినిమా కూడా మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది.

 

బద్రీనాథ్.. 

 

తెల్ల తోలు సుందరి తమన్నాతో కలిసి నటించాడు. ఈ సినిమాలో భక్తుడులా కనిపించి అందరిని ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో కొన్ని కొన్ని సన్నివేశాలు.. ఫైటింగ్ అన్ని కూడా అదిరిపోయాయి అంటే నమ్మండి. 

 

జులాయి.. 

 

సినిమా అయితే ఎంతమందికి ఫేవరేటో, ఎందుకంటే ఈ సినిమాలో నటించింది బన్నీ అయితే సినిమాకు దర్శకత్వం వహించింది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాబట్టి ఈ సినిమా అదిరిపోయింది అంటే నమ్మండి. ఇక ఈ సినిమాలో డైలాగులు అదుర్స్ అంటే నమ్మండి. అందుకే ఈ సినిమాను ఎన్ని సార్లు చుసిన బోర్ కొట్టదు. 

 

ఇద్దరమ్మాయిలతో.. 

 

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్లాప్ అయినప్పటికీ.. డైలాగులు అదుర్స్. ఫైట్లు సూపరు.. ఇక అన్నిటికంటే ముఖ్యంగా రొమాన్స్ సూపర్ అంటే సూపరు. అందుకే కుర్రాళ్లకు తెగ నచ్చేసింది ఈ సినిమా. సినిమా ప్లాప్ అయినప్పటికీ కొన్ని కొన్ని సీన్స్ మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది. 

 

రేసుగుర్రం.. 

 

ఈ సినిమాలో అన్నతమ్ములు అనుబంధం ఎలా ఉంటుంది అనేది చూపించారు. అప్పటి వరుకు ఎప్పుడు టామ్ అండ్ జెర్రీలా గొడవ పడే అన్నతమ్ములు ఒక్కసారిగా వారిపైకి ఎవరైనా వస్తే ఎలా రియాక్ట్ అవుతారు.. కుటుంబాన్ని ఎలా చూసుకుంటారు అనేది చూపించి.. తనలోని మాస్ యాంగిల్ ని చూపించి ఆకట్టుకున్నాడు అంటే నమ్మండి. 

 

సన్ అఫ్ సత్యమూర్తి.. 

 

ఈ సినిమాలో తండ్రి ప్రేమను.. తండ్రికి ఇచ్చే విలువను.. వాల్యూస్ ను గొప్పగా చూపించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమాను కూడా త్రివిక్రమే తీశాడు. ఇంకా ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్సిడెంట్ ఒక కుటుంబాన్నీ రోడ్డుపైకి ఎలా లాగేస్తుంది అనేది కళ్ళకు కట్టినట్టు చూపించారు. 

 

సరైనోడు.. 

 

సినిమా మాస్ అభిమానులకు బాగా కనెక్ట్ అవుతుంది అంటే నమ్మండి. ఈ సినిమాలో ఫైట్స్ సూపర్ అంటే సూపర్.. ఇంకా ఒక ఎమ్మెల్యే అంత అందంగా ఉంటుంది.. అంత చిన్న వయసులో ఎమ్మెల్యే ఉంటుంది అనేది కూడా ఈ సినిమాలోనే చూస్తాం. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మాస్ అభిమానులకు పండుగ అంటే నమ్మండి. 

 

అల వైకుంఠపురములో.. 

 

2020 సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా ఇప్పటికి రికార్డ్స్ సృష్టిస్తూనే ఉంది. ఈ సినిమా చుసిన అభిమానులు ఒకటికి రెండు మూడు సార్లు చూశారు అంటే నమ్మండి. ఇంకా ఈ సినిమాలో బుట్ట బొమ్మ సాంగ్ అయితే సూపర్ హిట్టో చెప్పక్కర్లేదు.. ఇంకా ఈ సినిమాను కూడా మళ్లీ మళ్లి చూడాలి అనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: