టాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఇష్టపడే దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అతని దర్శకత్వంలో సినిమా చెయ్యాలని ఎందరో హీరోలకు ఉంటుంది. అతని తో సినిమా కోసం తీవ్ర ప్రయత్నాలు చేసే స్టార్ హీరోలు కూడా ఉన్నారు. ఆయనతో సినిమా అనగానే ఇతర సినిమాలను కూడా వదులుకునే హీరోలు కూడా ఉన్నారు అనేది వాస్తవం. ఇది పక్కన పెడితే అతను ఒక హీరోకి మాత్రం లక్కీ. అతనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ లక్కీ దర్శకుడు అయిపోయాడు. అతనితో చేసిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. 

 

ముందు జులాయి సినిమా చేసాడు అల్లు అర్జున్. ఆ సినిమాకు ముందు అల్లు అర్జున్ కి ఫ్లాప్ వచ్చింది. ఆ తర్వాత ఈ సినిమా చేసాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో మళ్ళీ కెరీర్ లో నిలబడ్డాడు అల్లు అర్జున్. ఆ తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా వీరి కాంబినేషన్ లో వచ్చింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా బన్నీ హీరీర్ లో మంచి హిట్స్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇక తాజాగా నా పేరు సూర్య సినిమా తర్వాత అల వైకుంఠపురములో సినిమా చేసారు ఈ ఇద్దరు. ఈ సినిమా అనేక రికార్డులు బద్దలు కొట్టింది. 

 

ప్రస్తుతం ఈ సినిమా ఇంకా ఆడుతూనే ఉంది. వచ్చే రెండు నెలలు అవుతున్నా సరే ఆ తర్వాత మంచి సినిమా ఏదీ రాకపోవడంతో ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అనేది వాస్తవం. ఇలా బన్నీ కెరీర్ లో త్రివిక్రమ్ లక్కీ దర్శకుడు అయ్యాడు అనేది వాస్తవం. ఏ దర్శకుడి తో అతను మూడు సినిమాలు చేయలేదు. ఈ సినిమా తర్వాత మరో సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: