అల్లు అర్జున్ బాల నటుడుగానే సినిమాలు చేశాడు.. అయితే మెగా స్టార్ చిరంజీవి డాడీ సినిమాలో అల్లు అర్జున్ ఒక పాత్ర చేశాడు అని.. అది మాత్రమే గుర్తుంటుంది. అయితే అల్లు అర్జున్ ఇప్పుడు కాదు బాల నటుడుగానే తెలుగు తెరకు పరిచయం. విజేత.. స్వాతిముత్యం సినిమాల ద్వారా అల్లు అర్జున్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 

 

IHG

 

అలాంటి అల్లు అర్జున్.. గంగోత్రి సినిమాలో ఎంత అద్భుతంగా నటించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో ప్రతి ఒక్కరి నోట్లో అల్లు అర్జున్ గంగోత్రి సినిమా గురించే టాక్. అలాంటి టాక్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ హీరోగా పనికిరాడు అనే టాక్ కూడా వినిపించింది. ఎందుకు అంటే అందం గురించి మాట్లాడి. 

 

IHG

 

అసలు అల్లు అర్జున్ హీరోగానే కాదు సైడ్ క్యారెక్టర్ గా కూడా పనికి రాడు అన్నారు. ఇంకా గంగోత్రి సినిమా చుసిన వాళ్ళు అంత ఒకటే మాట.. సినిమా అయితే బాగుంది కానీ హీరోనే బాలేడు అయ్యా అన్నారు. ఇంకా అలాంటి హీరో మరో సంవత్సరంలో వావ్ అనిపించేలా తయారయ్యాడు. 

 

IHG

 

ఆర్య సినిమాలో అల్లు అర్జున్ ని చూసి అభిమానులు అంత కూడా వావ్ అన్నారు అంటే నమ్మండి.. ఎంత బాగున్నాడు ఈ హీరో అన్నారు అంటే నమ్మండి. అసలు అల్లు అర్జున్.. ఇంత అందంగా ఉన్నాడా? మరి ఆ సినిమాలో ఏంటి అలా చూపించారు అని అనుకునే రేంజ్ అల్లు అర్జున్ కనిపించడు. అల్లు అర్జున్ బాగానే ఉన్నాడు కానీ ఆ సినిమాలోనే కావాలని అలా చూపించారు అంటూ ఆర్య సినిమా తర్వాత కామెంట్లు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: