మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ సాధించిన హీరో అల్లు అర్జున్.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా కోసం ఏమైనా చేస్తాడు. తన సినిమా విషయంలోనే కాదు తనకు నచ్చిన వేరే సినిమాలను కూడా బన్ని ప్రమోట్ చేస్తాడు. తనకు నచ్చిన పాట.. నచ్చిన సినిమా.. టాలెంట్ ఏదైనా బన్ని దృష్టిలో పడితే ఆ లెక్క వేరేలా ఉంటుంది.

 

కన్నుగీటి కుర్రాళ్ల హృదయాలను డిస్ట్రబ్ చేసిన వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ గురించి ప్రచారం చేసి ఆమె టాలెంట్ ను ఎకరేంజ్ చేశాడు బన్ని. ఇక హుశారు సినిమాలో ఉండిపోరాడే సాంగ్ బన్నికి ఫెవరెట్ సాంగ్ సిద్ శ్రీరామ్ పాడిన ఆ సాంగ్ ను బన్ని మెచ్చుకోవడం తెలిసిందే. ఇక అడివి శేష్ చేసే ప్రతి ప్రయత్నాన్ని అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తూ వచ్చారు. టాలెంట్ ఎంకరేజ్ చేయడంలో అసలు వెనుకడుగు వేయడు అల్లు అర్జున్.

 

అంతేకాదు తన సినిమా విషయంలో ఎక్కువ కష్టపడ్డ వారికి క్రెడిబిలిటీ ఇచ్చేస్తాడు. ఒక నిర్మాత కొడుకుగా సినిమాకు పెద్దగా కష్ట పడాల్సిన అవసరం లేకున్నా సినిమా అంటే బన్ని తన ప్రాణం పెట్టి మరి చేస్తాడు. మెగా హీరోగా తెరంగేట్రం చేసినా అల్లు అర్జున్ తన సొంత ఆర్మీ ఏర్పాటు చేసుకున్నారు. టాలీవుడ్ లో డాన్స్ చేసే హీరోల్లో బాలీవుడ్ హీరోలు సైతం షాక్ అయ్యేలా బన్ని డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. కరెక్ట్ సినిమా పడితే తన రేంజ్ ఏంటి అన్నది రీసెంట్ గా వచ్చిన అల వైకుంఠపురములో సినిమాతో ప్రూవ్ చేసిన అల్లు అర్జున్ సినిమా సినిమా కు తను చాలా డిఫరెంట్ గా ప్రయత్నిస్తాడు. కేవలం టాలీవుడ్ లోనే కాదు మలయాళంలో కూడా బన్నికి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే తన ప్రతి సినిమాను అక్కడ రిలీజ్ చేస్తున్నాడు అల్లు అర్జున్. 

మరింత సమాచారం తెలుసుకోండి: