టాలీవుడ్ లో అల్లు అర్జున్ కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అతని సినిమా అనగానే మెగా అభిమానుల్లోనే కాకుండా ఇతర అభిమానుల్లో కూడా ఒకరకమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా అతని సినిమా వస్తుంది అంటే ఎదురు చూసేది మెగా అభిమానుల కంటే ఇతర ప్రేక్షకులే ఎక్కువగా ఉంటారు. అది పక్కన పెడితే మెగా ఫ్యామిలీ లో చిరంజీవి తర్వాత వచ్చిన ఏ హీరో అయినా సరే చిరంజీవి నీడలో వచ్చిన వారే అని అంటూ ఉంటారు. పది మంది వరకు ఆ కుటుంబం నుంచి వచ్చారు హీరోలు. హీరోయిన్ కూడా ఒకరు ఉన్నారు. 

 

వీళ్ళు అందరూ కూడా చిరంజీవి నీడలో వచ్చిన వాళ్ళే. అయితే అల్లు అర్జున్ మాత్రం దానికి ఎంత మాత్రం ఇష్టపడటం లేదు. చిరంజీవికి అతను దూరంగా ఉన్నాడని అంటూ ఉంటారు. అతనికి చిరంజీవి తో కలిసి ఉంటే తన ప్రతిభ పైకి కనపడటం లేదనే భావనలో బన్నీ ఉంటాడట. తనకు అంటూ ఒక ఫాన్ బేస్ ఉందని ప్రత్యేకంగా ఎవరి అభిమానులు తనకు అవసరం లేదని అతను భావిస్తాడని, ప్రధానంగా సోషల్ మీడియా లో కూడా ఎక్కువగా ప్రచారం జరుగుతున్నాయి. చిరంజీవి తో తనకు అవసరం లేదని అల్లు అర్జున్ ముందుకి వెళ్తున్నాడు. 

 

అందుకే తనకు ఆర్మీ ఉందని అందరికి ఫాన్స్ ఉంటారని బన్నీ ఎవరిని టార్గెట్ చేసి అన్నాడు అనేది అందరికి అర్ధమవుతుంది. సోషల్ మీడియాలో కూడా అతనికి మెగా ఫాన్స్ నుంచి పెద్దగా మద్దతు ఉండదు. అతని సినిమాలకు మెగా ఫాన్స్ ఏమీ పెద్దగా హడావుడి చేసే పరిస్థితి ఉండదు. దీనికి కారణం అల్లు అర్జునే అని అంటున్నారు. వాస్తవానికి అందరు హీరోల అభిమానులు అతని సినిమాలను చూస్తూ ఉంటారు. దీనితోనే అల్లు అర్జున్ ఈ తన ఇమేజ్ నే నమ్ముకున్నాడని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: