స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కేవలం సినిమాల్లో మాత్రమే స్టైలిష్.. పిల్లల దగ్గర సూపర్ డాడీ.. ఊర మాస్. ఎలా అనుకుంటున్నారా? ఇంకేలా అండి.. అల్లు అర్జున్ కు ఒక కోడుకు.. ఒక కూతురు. కొడుకుతో ఫోటోలలో ఎక్కువగా కనిపించాడు కానీ కూతురుతో మాత్రం కేవలం ఫొటోలే కాదు వీడియోలు కూడా చేసి సోషల్ మీడియాలో పెట్టేస్తుంటాడు. 

 

 

అవును.. ఏ తండ్రికి అయినా కూతురు అంటేనే ఇష్టం.. కూతురే గారాల పట్టి. ఎందుకంటే కూతురుతో వారి తల్లిని చూసుకుంటారు కాబట్టి కూతురు అంటే ఇష్టం. అలానే అల్లు అర్జున్ కు కూడా కూతురు అంటే మహా ప్రేమ.. అందుకే ఆ పిల్లకు చిన్న చిన్న మాటలు నేర్పించి అవి మాట్లాడితే మంచి ప్రేమతో కామెడీ వీడియోను చిత్రీకరించి చూపిస్తుంటారు. 

 

 

ఇంకా ఆ వీడియోలలో ఒక వీడియోలో.. నాన్న చెప్పినట్టు విని అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పు అని అర్హను అడిగితే నేను చేసుకోను అంటూ ముద్దు ముద్దుగా తెలుగు మాటలు చెప్పి అభిమానులను అందరిని ఆకట్టుకున్నాడు అల్లు అర్జున్. ఇంకా ఈ నేపథ్యంలోనే ఈ మధ్య ఓ వీడియో మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

 

ఆ వీడియో ఏంటి అంటే..? అల్లు అర్జున్ ను అర్హ బే అంటుంది.. నాన్ననే బే అంటావా? అని అల్లు అర్జున్ అంటే.. అంటాను బే అంటూ కామెంట్ చేస్తుంది. ఇక అలానే బే బే అంటూ మంచి కామెడీనే చేస్తుంది ఆ పిల్ల. అయితే ఈ వీడియోను చూసి కొందరు సూపర్ సూపర్ అని అనగా.. మరికొందరు మాత్రం ఆ వీడియోను చూసి సభ్యసమాజానికి ఈ వీడియోతో ఎం నేర్పుతున్నావు బన్నీ అంటూ ఓవర్ కామెంట్లు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: