సాధారణంగా ఉత్తరాది నటులకు దక్షిణాది నటుల మీద కాస్త చిన్న చూపు ఉంటుందన్న టాక్‌ వినిపంచిందే. అంతేకాదు ఇండియాలో అతి పెద్ద సినిమా ఇండస్ట్రీగా పేరున్న బాలీవుడ్‌ సినీ జనాలు ఇతర రీజినల్‌ సినిమా అన్నా, ఆ ఇండస్ట్రీల స్టార్స్‌ అన్న పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు సీన్‌ మారిపోయింది. మేకింగ్‌, టేకింగ్ లతో పాటు వ్యక్తిగతంగా డ్యాన్స్‌ లు, స్టైల్స్‌ లోనూ మన స్టార్స్‌ సత్తా చాటుతున్నారు.

 

ఈ లిస్ట్‌ లో అందరికంటే ముందున్న స్టార్ అల్లు అర్జున్‌. తెలుగు లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్ డ్యాన్సర్‌ గా పేరు బన్నీ స్టైల్‌కు బాలీవుడ్ సినీ జనాలు కూడా ఫిదా అయ్యారు. తాజాగా ఇండియన్‌ బెస్ట్ డాన్సర్‌ గా పేరున్న హృతిక్‌ రోషన్‌ కూడా బన్నీ డ్యాన్స్‌ కు నేను ఫ్యాన్‌ అంటూ చెప్పాడు. బన్నీ స్టైల్‌ సూపర్బ్ అంటూ పొగిడిన హృతిక్‌ రోషన్‌ మరో సౌత్‌ హీరో విజయ్‌ స్టైల్‌ కు కూడా ఫిదా అంటూ ప్రకటించాడు.

 

గతంలో పలువురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా బన్నీ డ్యాన్స్‌కు ఫిదా అయ్యామంటూ ప్రకటించారు. ఇక బాలీవుడ్‌ బాద్‌ షా షారూఖ్‌ ఖాన్ కూడా అల్లు అర్జున్‌ అంటే తనకెంతో ఇష్టమన్నాడు. అంతేకాదు ఏదో ఒక రోజు సౌత్‌ కు వచ్చి నీతో కలిసి క్వాలిటీ టైం గడపాలని ఉంది అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశాడు షారూఖ్‌. దీంతో బన్నీ క్రేజ్‌ బాలీవుడ్‌ లోనూ ఓ రేంజ్‌ లో ఆడియన్స్‌ తెగ సంబరపడిపోతున్నారు. బన్నీ హీరోగా తెరకెక్కిన తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ వర్షన్‌ లు యూట్యూబ్‌ లో రికార్డ్‌ లు సృష్టించటం కూడా బన్నీపై బాలీవుడ్ దృష్టి పడటానికి కారణంగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: