పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడు గా  చిరంజీవి పవన్ కళ్యాణ్ ల మేనల్లుడు గా ఫిలిం ఇండస్ట్రీలోకి ‘గంగోత్రి’ మూవీతో అడుగు పెట్టిన అల్లు అర్జున్ ను అతడి మొదటి సినిమాలో చూసిన వారు అతడి రాబోయే రోజులలో స్టైలిష్ స్టార్ గా మారుతాడని ఎవరు ఊహించలేదు. సుమారు 17 సంవత్సరాలకు పైగా హీరోగా కొనసాగుతూ టాలీవుడ్ టాప్ హీరో రేంజ్ కి ఎదిగిన అల్లు అర్జున్ జీవిత ప్రస్థానంలో ఎన్నో సినిమాల నుండి జీవిత భాగస్వామి ఎంపిక వరకు ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. 

 

చిన్నతనం నుండే చిరంజీవి సినిమాలను చూస్తూ పెరిగిన బన్నీ కొన్ని సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టుగా ముందు నటించినా చిరంజీవి నటించిన ‘డాడి’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి తన సొంత ఇమేజ్ కి శ్రీకారం చుట్టాడు. డాన్స్ బాగా చేయగల అబ్బాయి కోసం ఆ మూవీ నిర్మాత అరవింద్ ఆలోచిస్తూ ఉంటే చిరంజీవి స్వయంగా బన్నీ పేరును చెప్పి పట్టుపట్టి ఆ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటింప చేసి బన్నీకి విపరీతంగా సినిమాల పై మోజు పెరిగేలా చేసాడు. 

 

వాస్తవానికి బన్నీని హీరోగా కన్నా ఆమె తల్లి పియోనా వాయిద్య కళాకారుడుగా చూడలన్న కోరికతో అతడి తల్లి నిర్మల చిన్నప్పుడు బన్నీని మ్యూజిక్ క్లాసులకు పంపేవారట. అయితే బన్నీ దృష్టి మాత్రం ఎప్పుడు సినిమాల పై ఉండటంతో ఆమె మొదట్లో అంతగా ఇష్టపడక పోయినా బన్నీ కోరిక మేరకు ‘గంగోత్రీ’ మూవీలో ఎంట్రీ జరిగింది. ఈ సినిమా హిట్ అయినప్పటికీ బన్నీకి టాప్ స్టార్ ఇమేజ్ ‘దేశముదురు’  ‘ఆర్యా’ సినిమాలతో ఏర్పడింది.

 

ఆతరువాత మధ్యలో కొంత పరాజయాలు వచ్చినా బన్నీ కెరియర్ ఎక్కడా బ్రేక్ లేకుండా కొనసాగుతూ లేటెస్ట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ స్థాయికి ఎదిగి ఇప్పుడు ఏకంగా మెగా ఫ్యామిలీకి తన సొంత ఇమేజ్ తో చెక్ పెట్టె రేంజ్ లో తనకంటూ ‘ఆర్మీ’ ఏర్పరుచుకున్నాడు. అయితే గత కొంతకాలంగా బన్నీకి పెరిగిన మ్యానియాతో మెగా ఫ్యామిలీ భయపడుతోంది అంటూ కొందరి కామెంట్స్. దీనికితోడు ఆమధ్య ‘చెప్పను బ్రదర్’ అంటూ పవన్ అభిమానులతో రగడ సృష్టించుకోవడం క్రితం సంవత్సరం జరిగిన ‘సైరా’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు రాకపోవడంతో బన్నీకి ఇగో పెరిగింది అన్న కామెంట్స్ విపరీతంగా వినిపించాయి.

 

ఈ కామెంట్స్ అన్నీ తన దృష్టి వరకు రావడంతో అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ‘తన కట్టె కాలేవరకు’ చిరంజీవి అభిమానిగానే తాను కొనసాగుతాను అంటూ క్లారిటీ ఇస్తూనే తన తండ్రి అరవింద్ కు పద్మశ్రీ ఎందుకు ఇవ్వడం లేదో అర్ధం కావడం లేదు అంటూ కామెంట్ చేసి మళ్ళీ తన ఇగో ను బయట పెట్టుకున్నాడు. సినిమాల కెరియర్ పరంగా చిరంజీవి పవన్ కళ్యాణ్ లకు సవాల్ విసిరే స్థాయికి ఎదిగిన బన్నీ బయట ఎన్ని సార్లు తాను చిరంజీవి వీరాభిమాని ని అని చెపుతున్నా పూర్తిగా ఆ మాటలను మెగా అభిమానులు విశ్వసించ లేని పరిస్థితి. మెగా ఫ్యామిలీతో చిన్న గ్యాప్  ఉన్నా ఆ గ్యాప్ ను బయట పడనీయకుండా చాల తెలివిగా మేనేజ్ చేస్తున్న బన్నీ సినిమాలలోనే కాదు నిజ జీవితంలో కూడ ‘దేశముదురు’..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: