టాలీవుడ్ ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్ కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చందమామ  సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగువారికి ఎంతగానో దగ్గర అయిపోయింది. మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడి చెంతకు వరుస అవకాశాలు వచ్చాయి. ఇక చందమామ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు ఈ ముద్దుగుమ్మ. వరుస అవకాశాలను చేజిక్కించుకొని  ఎన్నో విజయాలను అందుకుంది. టాలీవుడ్ లో సీనియర్ హీరోలతో పాటు జూనియర్ హీరోల సరసన కూడా నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది  ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ లో చందమామ లాంటి హీరోయిన్ ఎవరూ అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు కాజల్ అగర్వాల్. కేవలం సినిమాల్లో పాత్రలతోనే కాదు సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో కూడా ఎంతో మంది ప్రేక్షకుల ను సంపాదించుకుంది కాజల్ అగర్వాల్. 

 

 

 ఇక ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికే దశాబ్ద కాలం పూర్తయిన కూడా యువ హీరోయిన్లకు  పోటీ ఇస్తునే  ఉంది. మొదట గ్లామర్ పాత్రలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ... ఆ తర్వాత నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా చేస్తూ వచ్చింది. ఓవైపు సినిమాలతో మరోవైపు సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరిస్తోంది ఉంది ఈ ముద్దుగుమ్మ. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం హిందీ సినిమాల్లో కూడా నటిస్తోంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో యువ హీరోయిన్ లు  ఎక్కువగా రావడంతో కాజల్ అగర్వాల్ కి కాస్త డిమాండ్ తగ్గిపోయింది అని చెప్పాలి. అయినప్పటికీ ఈ అమ్మడికి సినిమా అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం కమల్ హాసన్  సరసన భారతీయుడు 2 సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

 

 

 అంతేకాకుండా మోసగాళ్లు అనే సినిమాలో కూడా నటిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ అసలు సినిమాలే లేని  హీరో సరసన నటించేందుకు సిద్ధమైంది. కొరియన్ మూవీ డాన్సింగ్ క్వీన్  తెలుగులో రీమేక్ చేసేందుకు రైట్స్ దక్కించుకున్నారు  నిర్మాత సురేష్ బాబు. ఈ సినిమాలో కాజల్ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇక మరో ముఖ్య పాత్రలో అల్లరి నరేష్ నటించనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అఫీషియల్ ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ హిందీలో ముంబై సాగా,  తమిళ్ లో కమలహాసన్ భారతీయుడు 2,  తెలుగులో మంచు విష్ణు మోసగాళ్లు సినిమాల్లో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: