ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల పోరాటంలో ‘జనసేన’ కూడ పోటీ చేస్తున్న పరిస్థితులలో కనీసం 10 రోజుల పాటు ‘వకీల్ సాబ్’ షూటింగ్ కు బ్రేక్ పడుతోంది. దీనితో పవన్ పాత్రతో సంబంధం లేని సీన్స్ ను ఈగ్యాప్ లో షూట్ చేసి అనుకున్న విధంగా ఎట్టి పరిస్థితులలోను ఈమూవీని మే 15న విడుదల చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు అన్వేషిస్తున్నారు. 


ఇది ఇలా ఉండగా ‘వకీల్ సాబ్’ మూవీ మాతృక అయిన ‘పింక్’ మూవీలోని సీన్స్ కంటే ఈమూవీ రీమేక్ గా అజిత్ తమిళంలో నటించిన ‘నెరకొండ పరవాయ్’ మూవీలోని సీన్స్ ఎక్కువగా ‘వకీల్ సాబ్’ కనిపిస్తాయి అని అంటున్నారు. వాస్తవానికి హిందీలో వచ్చిన ‘పింక్’ మూవీలో కోర్ట్ సీన్స్ మొదలయ్యాక కూడ లాయర్ పాత్రలో నటిస్తున్న అమితాబ్ మాట్లాడడు. చాలాసేపు మౌనంగా ఉంటూ ఆతరువాత మాత్రమే బాధితులైన ఆ ముగ్గురి అమ్మాయిల కోసం తన వాదన వినిపిస్తాడు. 


అయితే అజిత్ నటించిన తమిళ సినిమాలో మటుకు అజిత్ కు ఒక భార్య పాత్రను క్రియేట్ చేసి ఒక కేసు నిమిత్తం అజిత్ వాదించడానికి మరొక ఊరు వెళ్ళినప్పుడు అజిత్ ను మానసికంగా దెబ్బ తీయడానికి గర్భవతి అయిన అజిత్ భార్యను హత్య చేసే సీన్స్ క్రియేట్ చేసారు. ఈసీన్స్ అన్నీ చాల ఎమోషనల్ గా ఉంటాయి. ఇప్పుడు ఆ సీన్స్ ను అదే ఎమోషన్ రిపీట్ చేస్తూ తెలుగులో కూడ తీసినట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి ఎమోషనల్ సీన్స్ చాల సినిమాలలో ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు చూసి బోర్ ఫీల్ అవుతున్నారు. 


ఇలాంటి పరిస్థితులలో మళ్ళీ సెంటిమెంట్ ఎక్కువగా ఉండే అలాంటి సీన్స్ వల్ల ‘వకీల్ సాబ్’ కు ప్రయోజనం ఉంటుందా అన్న సందేహాలు వస్తున్నాయి. ఉదాత్తమైన ‘పింక్’ కథను టాప్ హీరో అజిత్ కోసం మార్పులు చేయడంతో అజిత్ ఫ్యాన్స్ కూడ పెద్దగ ప్రశంసలు కురిపించక పోవడంతో ఆమూవీ తమిళంలో ఎవరేజ్ హిట్ గా మారింది. అయితే తమిళ రీమేక్ కు మించి ప్రతి డైలాగ్ లోను పవన్ భావజాలం విపరీతంగా హైలెట్ అయ్యే విధంగా ‘వకీల్ సాబ్’ మార్పులు చేసిన పరిస్థితులలో చివరకు ఈ మూవీ పవన్ అభిమానుల మూవీగా మిగిలిపోతుందా అన్న సందేహాలు కొందరు వ్యక్త పరుస్తున్నారు..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: