మెగా ఫ్యామిలీ లో కాస్త భిన్నంగా ఉండే వ్యక్తుల్లో ప్రధానంగా చెప్పుకునేది నాగబాబు, అల్లు అర్జున్. వీరిద్దరూ మెగా ఫాన్స్ మీద పవన్ కళ్యాణ్ ఫాన్స్ మీద ఏదోక సందర్భంగా విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. దీనితో వీరు అంటే మెగా ఫాన్స్, పవన్ ఫాన్స్ కాస్త ముందు నుంచి అసహనంగానే ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా వీరి వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తూ ఉంటాయి మెగా ఫాన్స్ నుంచి. ఇది పక్కన పెడితే, వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి అంటున్నారు కొందరు. దానికి కారణం ఏంటీ అనేది తెలియకపోయినా వీరి మధ్య పొసగడం లేదని అంటున్నారు. 

 

కొన్ని సినిమాల విషయంలో వీరి మధ్య విభేదాలు వచ్చాయని, అల్లు అరవింద్ వరుణ్ తేజ్ తో సినిమా చెయ్యాలని చూడగా అల్లు అర్జున్ అడ్డం పడ్డాడు అని నాగబాబు ఒక సందర్భంలో భావించారట. అప్పటి నుంచి వీరి మధ్య విభేదాలు ఉన్నాయని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని అల్లు అర్జున్ ఒక సందర్భంలో విమర్శించారు. అప్పుడు పవన్ కళ్యాణ్ కి నాగ బాబుకి మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి. ఆ తర్వాత జనసేన పార్టీ పుణ్యమా అని నాగబాబు... పవన్ కళ్యాణ్ దగ్గరయ్యారు. అప్పుడు అల్లు అర్జున్ ని నాగబాబు కొంత మంది వద్ద తిట్టినట్టు సమాచారం. 

 

వాస్తవానికి నాగబాబు కాస్త ఆవేశ పరుడు. అల్లు అర్జున్ కాస్త నెమ్మదిగా ఆలోచించే మనిషి. నాగబాబు తనపై చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ కి నచ్చలేదని అందుకే నాగబాబు అల్లు అర్జున్ విషయంలో దూరంగా ఉన్నారట. కొన్ని కొన్ని సినిమాలను అల్లు అరవింద్ తో చెయ్యాలి అని చూసినా సరే అల్లు అర్జున్ కారణంగా నాగబాబు వెనక్కు తగ్గారని అంటున్నారు. ఒక అగ్ర దర్శకుడి గురించి కూడా వీరి మధ్య గొడవలు వచ్చినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: