స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గంగోత్రి టూ అల వైకుంఠపురములో కెరియర్ గ్రాఫ్ చూస్తే ఎక్కడ మొదలై ఎక్కడకు చేరుకున్నాడో అర్ధమవుతుంది. మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరోగా మొదట్లో మెగా ఫ్యాన్స్ సపోర్ట్ అందుకున్నా తర్వాత తర్వాత తన సొంత టాలెంట్ తో అదరగొడుతున్నాడు. ఒక నిర్మాత కొడుకుగా అంత కష్టపడాల్సిన అవసరం లేకపోయినా సరే బన్ని సినిమా కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటాడు. సినిమా మీద అతనికి ఉన్న కమిట్మెంట్ అది అని చెప్పొచ్చు. 

 

టాలీవుడ్ లోనే కాదు మలయాళంలో కూడా సత్తా చాటుతున్న అల్లు అర్జున్ ని అక్కడ మల్లు అర్జున్ గా పిలుచుకుంటారు. ఎంచుకున్న కథ ఎలాంటిదైనా సరే దానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయడమే బన్ని వర్క్. టాలీవుడ్ లో నిర్మాతల కొడుకులు స్టార్ అయిన వాళ్ళు చాలా తక్కువ. అయితే అలాంటి వారిలో బన్ని నంబర్ 1 లో ఉంటాడు. స్టార్ హీరోల వారసులే స్టార్స్ అవుతారు అన్న సెంటిమెంట్ బ్రేక్ చేసేలా స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుగా అల్లు అర్జున్ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. 

 

టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న బన్ని బాలీవుడ్ టార్గెట్ పెట్టుకున్నాడు. ఇప్పటికే బన్ని మిగతా భాషల సినిమాల ప్రయత్నాలు చేస్తున్నా అవి కార్యరూపం దాల్చడం లేదు తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న బన్ని త్వరలో పాన్ ఇండియా మూవీ ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. స్టైలిష్ స్టార్ గా బన్ని చేసే సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న బన్ని అది ఎప్పుడు చేస్తాడో అని ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు. తప్పకుండా అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే మాత్రం ఆ రేంజ్ వేరేలా ఉంటుంది. బన్ని చేసిన తెలుగు సినిమా లు డబ్ అయ్యి యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్థాయి అందుకే బన్ని బాలీవుడ్ సినిమా చేస్తే మాత్రం అదిరిపొద్దని  చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: