స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి టాలీవుడ్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరుస సినిమాలు చేసుకుంటూ ఎన్నో బ్లాక్ బస్టర్  విజయాలను అందుకున్నారు అల్లు అర్జున్. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. గంగోత్రి సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన అల్లు అర్జున్ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఏకంగా తెలుగు ప్రేక్షకులకు స్టైలిష్ స్టార్ గా మారిపోయాడు. ప్రతి సినిమాలో ఎప్పుడూ కొత్తగా కనిపిస్తూ ఉంటాడు అల్లు అర్జున్. అందుకే అల్లు అర్జున్ స్టైల్ యూత్ ని బాగా ఆకర్షిస్తుంది. ఇక  ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించే విధంగా ఎన్నో విభిన్నమైన కథలతో సినిమాలలో నటిస్తూ ఉంటారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇక అల్లు అర్జున్ డాన్స్  గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

 

 

 టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో డాన్స్ చేసే హీరోలు ఎంత మంది ఉన్నప్పటికీ అల్లుఅర్జున్ మాత్రం ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటాడు. ఎందుకంటే అల్లు అర్జున్ డాన్స్ లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. ఇక యాక్షన్ సన్నివేశాల్లో కూడా ఇరగదీస్తు ఉంటాడు అల్లు అర్జున్. దేశముదురు సినిమాతో సిక్స్ ప్యాక్ చేసిన అల్లు అర్జున్ అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాడు  అల్లు అర్జున్. మొన్నటికి మొన్న అలా వైకుంఠపురములో సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే అల్లు అర్జున్ బిజినెస్ మాన్ కూతురు స్నేహ రెడ్డి ని పెళ్లి చేసుకున్నారు. 

 

 

 మామూలుగా అయితే కొంతమంది సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోలు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిని పెళ్లి చేసుకుంటారు. కానీ అల్లు అర్జున్ మాత్రం బిజినెస్ ఫీల్డ్ కి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ విషయాన్ని మనసులో దాచుకోలేక ఒకానొక సమయంలో మీడియా ప్రతినిధులు కూడా అల్లుఅర్జున్ ని అడిగేసారు . సినిమా వాళ్లను పెళ్లి చేసుకోకుండా... సినిమాలతో ఎలాంటి సంబంధం లేని వాళ్లను పెళ్లి చేసుకోవడం వెనుక ఉన్న కారణం ఏమిటి అని అడుగగా... అల్లు అర్జున్ ఆసక్తికర సమాధానం చెప్పాడు. తాను సెట్స్  నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళి సినిమా జీవితం లో ఉన్నాను అని అనిపించకుండా ఉండేలా.. సినిమాలకు సంబంధంలేని వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని.. ఇప్పుడు సెట్స్  నుంచి ఇంటికి వచ్చాక ఇంట్లోనే ఉన్నాను అనే అనుభూతి కలుగుతుంది అంటూ ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చాడు  అల్లు అర్జున్.

మరింత సమాచారం తెలుసుకోండి: