మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా సరే మాస్ ఆడియన్స్ కి దగ్గరయ్యే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. చిరంజీవి నుంచి మొదలుపెడితే, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్... ఇలా ఎవరు చూసినా సరే మాస్ ఆడియన్స్ కి దగ్గరైన వాళ్ళే. వాళ్ళ సినిమా వస్తుంది అంటే మాస్ ఆడియన్స్ తమ పనులు మానుకుని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు, వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నా సరే అది తక్కువ. చిరంజీవి సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసే వాళ్ళు. 

 

అయితే ఆ తర్వాత అల్లు అర్జున్ ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి పెళ్లి తర్వాత బాగా దగ్గరయ్యాడు. ఆర్యా 2 సినిమా తర్వాత అతను చేసిన సినిమాలు అన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యే విధంగా ఉన్నాయి. దానికి కారణం అతని భార్య స్నేహా రెడ్డి అంటారు. భార్యగా అతన్ని పూర్తిగా మార్చడం తో అప్పటి వరకు మాస్ ఆడియన్స్ మాత్రమే చూసే సినిమాలు క్లాస్ ఆడియన్స్ కూడా చూడటం మొదలుపెట్టారు. సన్ ఆఫ్ సత్య మూర్తి, ఆ తర్వాత వచ్చిన అన్ని సినిమాలు కూడా అలాగే ఉన్నాయి. 

 

ఇటీవల వచ్చిన అల వైకుంఠపురములో సినిమా కూడా అలాగే ఉంది. జులాయి సినిమా మాస్ క్లాస్ ఇద్దరినీ ఆకట్టుకున్నాడు. దీనితో దర్శకులు కూడా అతని ఇమేజ్ కి తగిన విధంగా జాగ్రత్తగా కథలు రాసుకుని ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యే సినిమాలే చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా అలాగే ఉంటుందని అంటున్నారు. కథ విషయంలో బన్నీ అంతే జాగ్రత్తగా ఆలోచిస్తూ ఎంపిక చేసుకుంటున్నాడు. ఇలా మెగా ఫ్యామిలీ లో మాస్ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: