గంగోత్రి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అల్లు అర్జున్ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం స్టార్ హీరోగా మారిపోయాడు. అయితే ఓ వైపు మెగా ఫ్యామిలీ సపోర్ట్... మరోవైపు అల్లు ఫ్యామిలీ సపోర్ట్ ఉండడంతో అల్లు అర్జున్ కి స్టార్ హీరోగా ఎదగడానికి పెద్ద కష్టమేమీ కాలేదు. తక్కువ కాలంలోనే స్టార్ హీరో ఇమేజ్ ను  సంపాదించాడు అల్లు అర్జున్. ఇక అల్లు అర్జున్ స్టార్ హీరో అవ్వడానికి వెనుక కేవలం సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండడంతో పాటు అల్లు అర్జున్ కష్టం కూడా అంతే ఉంది అని చెప్పాలి. అప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న హీరోలందరికీ భిన్నంగా అల్లుఅర్జున్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు. ఇక ప్రస్తుతం అయితే టాలీవుడ్ లో అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

 

 

 ఎన్నో బ్లాక్ బస్టర్  సినిమాలతో దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్. ఇక మొన్నటికి మొన్న అల్లు అర్జున్ అలా వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ ప్రముఖ వ్యాపారవేత్త కట్టా శేఖర్ రెడ్డి కూతురు స్నేహ రెడ్డి ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వీరిద్దరి ప్రేమకు గుర్తుగా... అయాన్, అర్హులు ఉన్నారు. ఇకపోతే అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి కి సినిమా ఇండస్ట్రీతో  అస్సలు సంబంధం లేదు. యుఎస్ లో ఎం.ఎస్ పూర్తిచేసిన స్నేహ రెడ్డి అల్లు అర్జున్ తో ప్రేమలో పడి... ఆ తర్వాత కొన్నాళ్ళకి వీరిద్దరికీ పెద్దలు వివాహం చేశారు. 

 

 

అయితే అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి కి సినిమాలు అంటే ఎంతో ఇష్టమట.. కానీ చిన్నప్పటి నుంచి స్నేహ రెడ్డి సినిమాలకు దూరంగానే ఉంటూ వచ్చింది. వాస్తవంగా స్నేహ రెడ్డి కి సినిమాలకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పాలి. కానీ సినిమాలు చూడటం  మాత్రం చాలా ఇష్టమట.ముఖ్యంగా స్నేహ రెడ్డి శేఖర్ రెడ్డి కి ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు ఫార్మాస్యూటికల్ కంపెనీల వ్యాపారం గురించి మాత్రమే స్నేహ రెడ్డి కి తెలుసు... కానీ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కి సినిమాలు చూడ్డం మాత్రం చాలా ఇష్టమట. అందుకే ఎక్కువగా సినిమాలు చూస్తూ ఉంటుందట అల్లు అర్జున్ భార్య.

మరింత సమాచారం తెలుసుకోండి: