ఇప్పటివరకు ‘ఆచార్య’ మూవీలో మహేష్ స్పెషల్ రోల్ కు సంబంధించి చిరంజీవి వైపు నుండి క్లారిటీ రాలేదు అంటూ ఊహాగానాలు హడావిడి చేసాయి. అంతేకాదు మహేష్ కు ఈపాత్రకు సంబంధించి ఇవ్వవలసిన పారితోషికం సుమారు 25 కోట్లకు చేరిపోవడంతో అంత బడ్జెట్ అనవసరం అని చిరంజీవి భావించడంతో ఈమూవీలో మహేష్ ఎంట్రీ గురించి అధికారక ప్రకటన ఆలస్యం అవుతోంది అంటూ గాసిప్పులు హడావిడి చేసాయి.


అయితే తెలుస్తున్న సమాచారం మేరకు అసలు వాస్తవాలు వేరు అని అంటున్నారు. ఇప్పటికే కొరటాల శివ మహేష్ ను కలిసి ‘ఆచార్య’ మూవీలో మహేష్ పాత్ర స్వరూపంతో పాటు మహేష్ ఎన్ని రోజుల ఈమూవీకి పనిచేయవలసి వస్తుందో స్పష్టమైన క్లారిటీ ఇచ్చాడు అని అంటున్నారు. అయితే మహేష్ ఈ మూవీలోని తన ప్రత్యేక పాత్రకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు సూచించడంతో ఆమార్పులు చేయడం చిరంజీవికి ఇష్టంలేదు అని అంటున్నారు.

 

అంతేకాదు చరణ్ కోసం క్రియేట్ చేయబడ్డ ఈపాత్రలో మహేష్ నటిస్తున్నాడు కాని ఈ మూవీలో మహేష్ కోసం ప్రత్యేక పాత్ర క్రియేట్ చేయబడలేదు అన్న క్లారిటీని మహేష్ కు చెప్పవలసిందిగా కొరటాల ను చిరంజీవి కోరినట్లు టాక్. అయితే ఈవాస్తవాలు యధాతదంగా కొరటాల మహేష్ కు చెప్పలేక మహేష్ కోరిన విధంగా అతడు నటించబోయే పాత్ర విషయంలో మార్పులు చేయలేక కొరటాల మహేష్ వద్ద తన మౌనాన్ని కొనసాగిస్తున్నట్లు టాక్.

 

ఈ విషయాలను మహేష్ కూడ ‘ఆచార్య’ విషయంలో తన ఫైనల్ నిర్ణయం తెలిపే విషయంలో గ్యాప్ బాగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా కొనసాగుతూ ఉంటే ఇప్పటికే పరుశు రామ్ చెప్పిన కధవిని మూడుసార్లు మార్పులు చేర్పులు చెప్పిన మహేష్ పరుశు రామ్ మహేష్ చెప్పిన విధంగా కథ వ్రాసి రెడీ పెట్టినా ఆ కథ పై కూడ తన ఫైనల్ నిర్ణయం తెలపలేకపోతున్నాడు అని అంటున్నారు. ఈమూవీలో నటిస్తే మైత్రీ మూవీస్ సంస్థ మహేష్ కు 50 కోట్ల పారితోషికం ఇస్తాము అని చెపుతున్నా చిరంజీవి మైత్రీ మూవీస్ మధ్య మహేష్ ఆడుతున్న గేమ్ ప్లాన్ ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది అని అంటున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: