కరోనా ఇప్పుడు ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ గజ గజలాడిస్తుంది.  కరోనా కు మందు లేదు.. దాన్ని మనం జాగ్రత్తలు తీసుకొని రక్షించుకోవాల్సింది.. ఒకవేళ కరోనా భారిన పడ్డవారు వెంటనే డాక్టర్లను సంప్రదించి సరైన వైద్యం తీసుకోవాల్సిందే.  ఎందుకంటే ఇప్పటి వరకు దీనికి యాంటీ డోస్ కనిపెట్టలేకపోయారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఎవరినైనా పట్టి పీడిస్తుంది. ఈ కరోనా వల్ల వాణిజ్య వ్యవస్థ కూడా కుదేలు అవుతుంది.  ముఖ్యంగా సినీ పరిశ్రమలకు కూడా ఈ ఎఫెక్ట్ బాగానే పడుతుంది. చాలా మంది విదేశీ షూటింగ్స్ క్యాన్సల్ చేసుకుంటున్నారు.

 

 భారత దేశంలో సైతం కొన్ని ఔట్ డోర్ షూటింగ్స్ అంటే భయపడిపోతున్నారు.  తాజాగా ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ సినీ ప్రముఖులను కూడా వదల్లేదు. హాలివుడ్ ప్రముఖ సినీనటుడు టామ్ హంక్స్, అతని భార్య రీటా విల్సన్‌లకు కరోనా వైరస్ సోకిందని వైద్యపరీక్షల్లో తేలింది. ఆస్ట్రేలియా దేశంలో ఓ సినిమా షూటింగులో ఉన్న సెలబ్రిటీ దంపతులు బుధవారం రక్తపరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చారు. అయితే వారికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్థారించారు.   టామ్ హంక్స్, రీటా విల్సన్ దంపతులను ఐసోలేషన్ గదికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

ఈ విషయం గురించి మాట్లాడుతూ.. జలుబు, ఒళ్లు నొప్పులు, జ్వరంతో బాధపడుతున్నాం...మాకు కరోనా వైరస్ సోకిందని పరీక్షల్లో తేలింది’’ అని చెప్పారు. అప్పటికీ ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా ఈ కరోనా మమ్ముల్ని వదల్లేదు అని వాపోయారు.  ఏది ఏమైనా కరోనాని అజాగ్రత్త చూడొద్దని.. ఇదొక డేంజర్ వైరస్ సెకన్లలో వ్యాప్తి చెందుతుందని అన్నారు. కరోనా వైరస్ ప్రబలుతున్నందు వల్ల ముందు జాగ్రత్తగా తన షోను నవంబరుకు వాయిదా వేస్తున్నట్లు జలుబుతో బాధపడుతున్న ప్రముఖ గాయకురాలు సీలైన్ డియాన్ ప్రకటించారు. తనకు జరిపిన పరీక్షలో కరోనా వైరస్ నెగిటివ్ అని వచ్చిందని సీలైన్ ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: